టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అవ్వటం కొత్త కాదని విమర్శించారు. సీట్ల కోసం భేటీ అయ్యారో.. నోట్ల కోసం భేటీ అయ్యారో వాళ్లే చెప్పాలని కీలక వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల నుండి కలిసి పోటీ చేస్తాం అని చెప్తున్న వాళ్ళు.. ఇప్పటివరకు సీట్ల వ్యవహారం తేల్చుకోలేకపోయారని మంత్రి ఆరోపించారు. మేం సిద్ధం అని జగన్ అంటుంటే.. టీడీపీ, జనసేన దగ్గర…
చంద్రబాబు నివాసంలో పవన్ కల్యాణ్ తో భేటీ ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్.. దాదాపు మూడు గంటల పాటు వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన టీడీపీ-జనసేన.. ఈ అంశంపై చర్చలు కొనసాగాయి. సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో దాదాపు స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో.. జనసేనకు ఎంత సీటు షేర్ ఇవ్వాలి.. ఏఏ నియోజకవర్గాలకు సంబంధించి గెలుపువకాశాలు ఉన్నాయన్న సర్వేల ఆధారంగానే తుది కసరత్తులు…
TDP-Janasena Alliance: ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల సన్నద్ధతలో టీడీపీ-జనసేన మరింత వేగం పెంచుతోంది. త్వరలోనే సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండుసార్లు భేటీ కాగా.. నేడు అమరావతిలో మరోసారి సమావేశం అయ్యారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై ఇద్దరు నేతలు కీలక చర్చలు చేస్తున్నారు. Also…
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సడన్ గా భారీ సినిమాలని ప్రొడ్యూస్ చేసే ప్రొడక్షన్ హౌజ్ అయిపొయింది. ప్రస్తుతం నానితో సరిపోదా శనివారం సినిమా చేస్తున్న ఈ బ్యానర్ కొత్తగా ‘హంగ్రీ చీతా’ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించిందని సమాచారం. డీవీవీ దానయ్య రిజిస్టర్ చేయించిన టైటిల్ ఎవరి కోసం అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఈ బ్యానర్ లో…
చంద్రబాబు ఇచ్చే దరఖాస్తును అమ్మవారి ఎదుట ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు బుద్దా వెంకన్న.. ఇక, ర్యాలీ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. టికెట్ రాలేదని ఎవరైనా చంద్రబాబుని విమర్శించినా తాట తీస్తానని హెచ్చరించారు. చంద్రబాబు నాకు దైవ సమానులు. చంద్రబాబుకిచ్చే అప్లికేషన్ ముందుగా కనకదుర్గమ్మకు ఇచ్చాను. విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి ఎంపీగా నాకు అవకాశం ఇవ్వాలని అప్లికేషన్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు
Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన విషయం తెల్సిందే. సినిమా రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం చిరుకు పద్మ విభూషణ్ అవార్డును అందించనుంది. ఇక ఈ విషయం తెలియడంతో ఇండస్ట్రీ మొత్తం చిరు ఇంటి ముందే నిలిచింది. చిన్నా, పెద్ద అని తేడాలేకుండా నటీనటులు అందరూ చిరుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.