చంద్రబాబు ఇచ్చే దరఖాస్తును అమ్మవారి ఎదుట ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు బుద్దా వెంకన్న.. ఇక, ర్యాలీ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. టికెట్ రాలేదని ఎవరైనా చంద్రబాబుని విమర్శించినా తాట తీస్తానని హెచ్చరించారు. చంద్రబాబు నాకు దైవ సమానులు. చంద్రబాబుకిచ్చే అప్లికేషన్ ముందుగా కనకదుర్గమ్మకు ఇచ్చాను. విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి ఎంపీగా నాకు అవకాశం ఇవ్వాలని అప్లికేషన్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు
Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన విషయం తెల్సిందే. సినిమా రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం చిరుకు పద్మ విభూషణ్ అవార్డును అందించనుంది. ఇక ఈ విషయం తెలియడంతో ఇండస్ట్రీ మొత్తం చిరు ఇంటి ముందే నిలిచింది. చిన్నా, పెద్ద అని తేడాలేకుండా నటీనటులు అందరూ చిరుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.. ఆ దిశగా మనమంతా కృషి చేయాలి అని పిలుపునిచ్చారు పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ బోడే ప్రసాద్.. నియోజకవర్గంలో నిర్వహించిన టీడీపీ - జనసేన ఉమ్మడి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించిన కష్టపడి పనిచేయాలి.. ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరిచేసుకోవాలి.. ముందుకు సాగాలి అన్నారు.
OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలతో.. ఇంకోపక్క సినిమాలతో బిజీగా మారారు. ఇక ఇప్పుడు అయితే పూర్తిగా రాజకీయాలకు పరిమితమయ్యారు . అందుకు కారణం.. త్వరలోనే ఏపీ ఎలక్షన్స్ ఉండడంతో సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చి ప్రచారాల్లో బిజీగా మారారు. ఇక ఆయన మధ్యలో వదిలిపెట్టిన సినిమాలో OG ఒకటి.
Producer Kayagurala Lakshmipathi Joins Janasena: కేఎల్పీ మూవీస్ సంస్థ అధినేత, నిర్మాత కాయగూరల లక్ష్మీపతి జనసేన పార్టీలో చేరారు. సోమవారం (జనవరి 29) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్మీపతి తండ్రి గారు కీ.శే. శ్రీ కె. నారాయణస్వామి గారు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ మనుగడకై, ప్రజాసేవకై కృషి చేసిన వ్యక్తి. తన తండ్రి గారి స్ఫూర్తితో…
భీమిలిలో సిద్దం సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కటౌట్స్ ఏర్పాటు చేశారు అని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పంచింగ్ బ్యాగ్స్ ఏర్పాటు చేసి పైశాచిక ఆనందం సీఎం జగన్ పొందుతున్నారు.. పరిపాలన వదిలి ప్రజలను రెచ్చ గొట్టే పని చేస్తున్నారు.
ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్లేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 4న జనసేన ఎన్నికల శంఖారావం పూరించనుంది. అందుకోసం అనకాపల్లిలో జనసేన భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. నూకాలమ్మ తల్లి అమ్మవారి దీవెనలతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు జనసేనాని.
Akira Nandan: సాధారణంగా ప్రతి కొడుకు.. తన తండ్రిలానే ఉంటాడు.కొడుకులో ఒకప్పటి తండ్రి కనిపిస్తాడు. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ సేమ్ ఇదే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పవన్ వారసుడు అకీరాలో వింటేజ్ పవన్ కనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ హీరో కాకముందు టీనేజ్ లో ఎలా ఉన్నాడో.. ఇప్పుడు అకీరా అలాగే కనిపిస్తున్నాడు.