వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించడమంటే చంద్రబాబును అధికారంలోకి తేవటమా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికారం కోసం కాపులు.. పవన్ కల్యాణ్ వెంట నడవడం లేదన్న ఆయన.. దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 40 నుండి 60 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని సూచించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఒకేరోజు రెండుసార్లు భేటీకావడం, సుదీర్ఘంగా చర్చలు జరపడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీట్ల సర్దుబాటుపై ఫైనల్ చర్చల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం దాదాపు మూడు గంటలపాటు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ సమావేశమయ్యారు.
కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మరోసారి రానున్నారు. సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు. అయితే.. ఎంపీ బాలశౌరి పార్టీలో చేరుతున్న సందర్భంలో పవన్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అని కాదు.. ఎంతని కాదు.. 98 శాతం స్ట్రైక్ రేట్ ఉండాలంటూ తెలిపారు. పొత్తుల్లో భాగంగా జరిగే సీట్ల సర్దుబాటు వల్ల కొందరికి బాధ కలిగించవచ్చని పవన్ వ్యాఖ్యానించారు.
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రెండు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న బాలశౌరి జనసేనలో చేరడం శుభ సూచకం అని అన్నారు. ఒక ఎంపీగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టాలని తపన పడ్డారని.. కేంద్ర నిధులు వచ్చేలా ఈ రాష్ట్రానికి మంచి జరిగేలా ఎంపీ బాలశౌరి వ్యవహరిస్తారని తెలిపారు.…
ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరారు. పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బాలశౌరిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం బాలశౌరి విజన్ తనకు నచ్చిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అనంతరం సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనని అర్జునుడుగా జగన్ పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆరోపించారు. సొంత చెల్లి షర్మిలను ఇష్టం వచ్చినట్లు…
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ.. ఈ ప్రజాస్వామ్యంలో దమ్ము ధైర్యంతో ప్రశ్నించే నాయకుడు ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది.. అలాంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. అందుకే రాష్ట్రంలో కొన్ని సమస్యలకైనా పరిష్కారం దొరికిందని చెప్పారు. బందర్ పోర్ట్ రావడానికి తన వంతు కృషి చేశానని.. బందరులో…
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు నుంచి భారీ ర్యాలీగా జనసేన కార్యాలయానికి వచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఎంపీతో పాటు ఆయన కుమారుడు అనుదీప్ కూడా జనసేనలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కీలక నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు పాల్గొన్నారు.
ఏపీలో త్వరలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. కాగా అధికార వైసీపీ పార్టీ.. సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తుంటే.. టీడీపీ, జనసేన కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో.. ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.
పద్మ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం సత్కారం.. ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సన్మానించింది. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర మంత్రులు హాజరయ్యారు. పద్మ అవార్డు గ్రహీతలను సత్కరించిన ముఖ్యమంత్రి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షల నగదును అందజేశారు. రెండు తెలుగు…