రాజకీయాల్లో శాశ్వత శతృత్వం, మిత్రత్వం ఉండదు అన్నారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన... ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా రాష్ట్రానికి మేలు జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.. ఇక, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని తెలిపారు
Cameraman Gangatho Rambabu: ఈ మధ్య కొత్త సినిమాల కంటే.. రీరిలీజ్ సినిమాలకే క్రేజ్ ఎక్కువ ఉంటుంది. థియేటర్ వద్ద రీరిలీజ్ సినిమాలు చేసే హంగామా అంతా ఇంతా కాదు. స్టార్ హీరోల పాత సినిమా రీరిలీజ్ అవుతుంది అనడం ఆలస్యం ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఇక ఆరోజు థియేటర్ లో ఫ్యాన్స్ చేసే రచ్చ మాములుగా ఉండదు.
త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పొత్తులపై చంద్రబాబుతో మంతనాలు జరపనున్నారు బీజేపీ ఢిల్లీ పెద్దలు. ఈ నెల 8వ తేదీన చంద్రబాబు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందంటున్నారు.. ఎనిమిదో తేదీన భేటీ కావాలని చంద్రబాబు - పవన్ కల్యాణ్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.. ఇక, చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు
TheyCallHimOG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం OG. DVV ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కళ్యాణ్లపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని ఫైర్ అయ్యారు. జగన్ జనంలోకి వెళుతుంటే టీడీపీ, జనసేన షేక్ అవుతున్నాయని ఆయన అన్నారు. 2014లో ఉమ్మడి పోటీగా ఇచ్చిన హామీల్లో ఒకటైనా నెరవేర్చారా అంటూ ప్రశ్నించారు.