TDP – JanaSena First List: టీడీపీ – జనసేన తొలి జాబితా.. సామాజిక సమీకరణాలు ఇలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP – JanaSena First List: ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.. ఇప్పటికే అధికార వైసీపీ వరుసగా అభ్యర్థులను ప్రకటిస్తూ.. ప్రచారాన్ని కూడా ప్రారంభించగా.. ఇప్పుడు టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ విడుదల చేశారు. 24 ఎమ్మెల్యే స్థానాల్లో, మూడు ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని.. మిగతా స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని చంద్రబాబు వెల్లడించారు. ఇక, తొలి జాబితాలో భాగంగా టీడీపీ 94 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారమే టీడీపీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామన్నారు. జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు.. ఇక, జనసేన ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.. మిగతా స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్నారు.. ఇక, టీడీపీ – జనసేన అభ్యర్థుల్లో సామాజిక సమీకరణాలు ఓసారి పరిశీలిద్దాం..
టీడీపీ – జనసేన విడుదల చేసిన తొలి జాబితాలో.. బీసీ: 19, ఎస్సీ: 20, ఎస్టీ: 03, కాపు: 10, కమ్మ: 22, రెడ్డి: 17, వైశ్య: 02, క్షత్రియ: 04, వెలమ: 01, మైనార్టీ: 01 ఉన్నారు.
Also Read
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
- Chamari Athapaththu: కెప్టెన్ సంచలనం.. 5 పరుగులిచ్చి 7 వికెట్లు డౌన్..! హ్యాట్రిక్ కూడాను..
- Congress Disciplinary Action: కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
తొలి జాబితాలో ఉన్న బీసీ అభ్యర్థులు.. 1. ఇచ్చాపురం- బెందాళం అశోక్, 2. టెక్కలి- అచ్చెన్నాయుడు, 3. ఆముదాలవలస- కూన రవి, 4. గజపతి నగరం- కొండపల్లి శ్రీనివాస్, 5. విశాఖ వెస్ట్ -గణబాబు, 6. నర్సిపట్నం – అయ్యన్నపాత్రుడు, 7. తుని – యనమల దివ్య, 8. రాజమండ్రి సిటీ- ఆదిరెడ్డి వాససు, 9. ఆచంట- పితాని సత్యనారాయణ, 10. నూజివీడు- కే పార్దసారధి, 11. పెడన – కాగిత కృష్ణప్రసాద్, 12. బందరు – కొల్లు రవీంద్ర, 13. రేపల్లె – అనగాని సత్య ప్రసాద్, 14. మైదుకూరు- పుట్టా సుధాకర్ యాదవ్, 15. పత్తికొండ- శ్యాంబాబు. 16. రాయదుర్గం- కాల్వ శ్రీనివాసులు, 17. పెనుకొండ- సవితమ్మ, 18. అనకాపల్లి(జనసేన) కొణతాల రామకృష్ణ, 19. నెల్లిమర్ల (జనసేన) లోకం మాధవి ఉన్నారు.
ఇక ఎస్సీ అభ్యర్థుల విషయానికి వస్తే 1. రాజాం- కొండ్రు మురళీచ, 2. పార్వతిపురం – విజయ గోనెల, 3. పాయకరావుపేట- వంగలపూడి అనిత, 4. పి.గన్నవరం- మహసేన రాజేష్, 5. చింతలపూడి- సొంగ రోషన్, 6. తిరువూరు -కొలికపూడి, 7. పామర్రు- వర్ల కుమార్ రాజా, 8. నందిగామ- తంగిరాల సౌమ్య, 9. తాడికొండ- తెనాలి శ్రావణ్., 10. వేమూరు- నక్కా ఆనందబాబు, 11. పత్తిపాడు- రామాంజనేయులు, 12. ఎర్రగొండపాలెం – ఎరిక్షన్ బాబు, 13. సంతనూతలపాడు – విజయ్ కుమార్, 14. కొండెపి – బాల వీరాంజనేయ స్వామి, 15. గూడూరు – సునీల్ బాబు, 16. సుళ్లూరుపేట – నెలవల విజయ శ్రీ, 17. కొడుమూరు – దస్తగిరి, 18. సింగనమల – బండారు శ్రావణి, 19. మడకశిర – సునీల్ కుమార్, 20. గంగాధర నెల్లూరు – థామస్ పేర్లు ప్రకటించారు.
ఎస్టీ అభ్యర్థుల పేర్ల విషయానికి వెళ్తే.. 1. కురుపాం – తొయ్యక జగదీష్, 2. సాలూరు – గుమ్మడి సంధ్యారాణి, 3. అరకు – దొన్నుదొర ఉన్నారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తే.. 1. పెద్దాపురం – నిమ్మకాయల రాజప్ప, 2. కొత్తపేట- బండారు సత్యనందరావు, 3. జగ్గంపేట – జ్యోతుల అప్పారావు, 4. పాలకొల్లు – నిమ్మల రామానాయుడు, 5. ఏలూరు – బడేటి రాధాకృష్ణ, 6. విజయవాడ(సెంట్రల్) – బోండా ఉమ, 7. సత్తెనపల్లి – కన్నా లక్ష్మీనారాయణ, 8. నెల్లూరు సిటీ – నారాయణ, 9. రాజానగరం – బత్తుల బలరామకృష్ణ, 10. కాకినాడ రూరల్ – పంతం నానాజీ ఉన్నారు.
ఇక, కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు.. 1. విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణబాబు, 2. మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు, 3. తణుకు – ఆరిమిల్లి రాధాకృష్ణ, 4. గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు, 5. గుడివాడ – వెనిగండ్ల రాము, 6. విజయవాడ(ఈస్ట్) – గద్దె రామ్మోహన్, 7. మంగళగిరి – నారా లోకేష్, 8. పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర, 9. చిలకలూరిపేట – పత్తిపాటి పుల్లారావు, 10. వినుకొండ – జీవీ ఆంజనేయులు, 11. పర్చూరు – ఏలూరి సాంబశివరావు, 12. అద్దంకి – గొట్టిపాటి రవి కుమార్, 13. ఒంగోలు – దామచర్ల జనార్దన్, 14. ఉదయగిరి – కాకర్ల సురేష్, 15. ఉరవకొండ – పయ్యావుల కేశవ్, 16. కళ్యాణ దుర్గం – అమిరినేని సురేందర్ బాబు, 17. రాప్తాడు – పరిటాల సునీత, 18. హిందూపురం – బాలకృష్ణ, 19. నగరి – గాలి భానుప్రకాష్, 20. కుప్పం – చంద్రబాబు, 21. తెనాలి – నాదెండ్ల, 22. చిత్తూరు – జగన్‌మోహన్ రావు
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను పరిశీలిస్తే.. 1. అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, 2. మాచర్ల – జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, 3. కనిగిరి – ఉగ్ర నరసింహారెడ్డి, 4. కావలి – కావ్య కృష్ణారెడ్డి, 5. నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి, 6. కడప – మాధవి రెడ్డి, 7. రాయచోటి -రాం ప్రసాద్ రెడ్డి, 8. పులివెందుల – బీటెక్ రవి, 9. ఆళ్లగడ్డ – అఖిల ప్రియ, 10 శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్ రెడ్డి, 11. పాణ్యం – గౌరు చరితా రెడ్డి, 12. బనగానిపల్లె – బీసీ జనార్దన్ రెడ్డి, 13. డోన్ – కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, 14. తాడిపత్రి – అస్మిత్ రెడ్డి, 15. తంబళ్లపల్లె – జయచంద్రారెడ్డి, 16. పీలేరు – నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, 17. పలమనేరు – అమర్నాధ్ రెడ్డి
వైశ్య సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు విషయానికి వస్తే 1. జగ్గయ్యపేట – శ్రీరాం తాతయ్య, 2. కర్నూలు – టీజీ భరత్.. ఇక, వెలమ సామాజిక వర్గం అభ్యర్థి 1. బొబ్బిలి – బేబీ నాయనా పేరు ప్రకటించారు.. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు.. 1. విజయనగరం – అదితి అశోక్ గజపతి రాజు, 2. ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు, 3. ఉండి – మంతెన రామరాజు, 4. బాపట్ల – వేగేశ్న నరేంద్ర వర్మ పేర్లను ప్రకటించారు.. మైనార్టీ అభ్యర్థి విషయానికి 1. నంద్యాల – ఫరూక్ పేరును ప్రకటించారు.
తాజావార్తలు
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
-
Romanchakam Overseas Review : రోమాంచకం ఓవర్సీస్ ప్రీమియర్ రివ్యూ
-
Chamari Athapaththu: కెప్టెన్ సంచలనం.. 5 పరుగులిచ్చి 7 వికెట్లు డౌన్..! హ్యాట్రిక్ కూడాను..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!