తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తోన్న "తెలుగు జన విజయ కేతనం జెండా" సభ ప్రారంభమైంది. వేదికపైకి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లతో పాటు ఇరు పార్టీలకు చెందిన ఐదువందల మంది నాయకులు చేరుకున్నారు.
టీడీపీ-జనసేన ఉమ్మడిగా నిర్వహించబోతున్న తొలి సభకు తాడేపల్లిగూడెం వేదికగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 6 లక్షల మంది ఈసభకు హజరవుతారనే అంచనాతో సభా ప్రాంగణాన్ని ఇరు పార్టీలు కలసి ముస్తాబు చేస్తున్నాయి. బుధవారం జరగబోయే సభకు తెలుగుజన విజయ కేతనం జెండా అనే పేరు పెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు వేదికపై నుంచి నాయకులకు, క్యాడర్‌కు దిశానిర్ధేశం చేయబోతున్నారు.
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలంటైన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే. శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ తో బిజీగా మారాడు. ఆయన ఏరోజైతే జనసేన పార్టీని స్థాపించాడో.. ఆరోజు నుంచి పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు పవన్. ప్రజల సమస్యలను తెలుసుకొని ఎంతో అద్భుతమైన జీవితాన్ని వదిలేసి.. పార్టీ ప్రారంభించాడు. కానీ, మొదట్లో రాజకీయాలు చేయడం, ప్రతిపక్షం పై విమర్శలు గుప్పించడం పవన్ కు చేతకాలేదు.
యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నాచురల్ స్టార్ నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన ఈ భామ.. ఇప్పుడు ఏకంగా పవన్ కల్యాణ్ తో కలిసి ‘ఓజీ’ అనే చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో తన ఫ్యాన్స్ తో ముచ్చటించింది. అందులో ఎక్కువగా తనకు ‘ఓజీ’ గురించే ప్రశ్నలు ఎదురవ్వగా సినిమాపై ఆసక్తికర అప్డేట్స్ ఇచ్చింది. ‘పవన్ కల్యాణ్ ఒక లెజెండ్. మంచి…
నెల్లూరు జిల్లాలో జనసేనకు ఒక స్థానం కూడా కేటాయించకపోవడంతో జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. జిల్లాకు సీటు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా.. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ.. జనసేన పార్టీ కోసం గత ఆరు సంవత్సరాల నుంచి నేతలు, కార్యకర్తలు ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారని తెలిపారు. ఈ పోరాటాలతోనే పార్టీని బలోపేతం చేసుకున్నామన్నారు. కరోనా సమయంలో ఎవరూ చేయని విధంగా…