Minister Chelluboina Venugopal Krishna: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై ఉత్కంఠ కొనసాగుతుండగా.. మరోవైపు పొత్తులపై అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సెటైర్లు వేస్తోంది.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీలోనే కాదు గల్లీల్లో పొర్లు దందాలు పెట్టినా ప్రజలు వైఎస్ జగన్ పక్షమే అని ధీమా వ్యక్తం చేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. స్వప్రయోజనాల కోసం పార్టీలు పెట్టుకున్నారే తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు ఏమున్నాయి? అన్న పవన్ కల్యాణ్ ఆ మాటలు మర్చిపోయారని దుయ్యబట్టారు.. టీడీపీతో పొత్తు అంటే ఢిల్లీ పెద్దలు దారుణంగా తిట్టారని పవన్ కల్యాణ్.. ఇదే విషయం టీడీపీకి స్వయంగా చెప్పారు.. కానీ, పెట్టిన పార్టీని స్వప్రయోజనం కోసం లాక్కున్నవాడు చంద్రబాబు.. ఆయన నుంచి ఎంతో కొంత సొమ్ము లాక్కోవడం కోసమే పవన్ పార్టీ పెట్టారంటూ ఆరోపణలు గుప్పించారు.
Read Also: Komuravelli Temple: కొమురవెల్లి ఆలయం వద్ద భక్తులపై లాఠీచార్జ్!
ఇక, స్వప్రయోజనాల కోసం కాకపోతే ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పాలని డిమాండ్ చేవారు వేణేగోపాలకృష్ణ.. ఢిల్లీ వీధిలో ఆంధ్రా ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ పెద్దలు దెబ్బతీస్తున్నారని ఎన్టీఆర్ పార్టీ పెడితే.. మూడు రోజులుగా చంద్రబాబు ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ పొత్తు కోసం పాకులాడుతున్నాడు.. ఈ పరిణామాలతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందన్నారు. నా జీవితంలో చేసిన పెద్ద తప్పు బీజేపీతో పొత్తు పెట్టుకోవడమేనని గతంలో చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు పొత్తు ఎందుకో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేవారు. కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని చంద్రబాబు తపన ఫైర్ అయ్యారు. అయితే, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీలోనే కాదు.. రాష్ట్రంలోని గల్లీల్లో పొర్లు దండాలు పెట్టినా ప్రజలు.. సీఎం వైఎస్ జగన్ పక్షమే.. ప్రజలు వైసీపీకి పట్టంకట్టం ఖాయం అన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.