Ex MLA Pamula Rajeswari: సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. టికెట్లు ఆశించిన నేతలు.. అవి సాధ్యం కాకపోవడంతో.. పక్క పార్టీలవైపు చూస్తూనే ఉన్నారు.. కండువాలు మార్చేస్తున్నారు.. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు.. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ ఇలా ఏ పార్టీలు మినహాయింపు కాదనే చెప్పాలి.. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి వంతు వచ్చింది.. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పాముల రాజేశ్వరి.. ఓటమి పాలయ్యారు.. అయితే, మరోసారి ఆమె జనసేన నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు.. దీంతో, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
Read Also: Pakistan: పాక్ ఆర్థిక రాజధానిని ఆక్రమించిన బిచ్చగాళ్లు!
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. గంటావారిపాలెం దగ్గర బస చేసిన విషయం విదితమే కాగా.. అక్కడి చేరుకున్నారు మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆమె వైసీపీ కండువా కప్పుకోనున్నారు.. కాగా, 2004, 2009 ఎన్నికల్లో పి గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేశారు పాముల రాజేశ్వరి.. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.. కొద్దికాలంగా జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నారు.. అయితే, పాములు రాజేశ్వరిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దకు తీసుకెళ్లారు అమలాపురం వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాద్.. పాముల రాజేశ్వరి వైసీపీ గూటికి చేరడం వెనుక రాపాక కీలకంగా పనిచేసినట్టు తెలుస్తోంది.