Chandrababu and Pawan Kalyan: నేటి నుంచి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu and Pawan Kalyan: సార్వత్రిక ఎన్నికల్లో జట్టుకట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ.. ఇప్పటికే ఉమ్మడిగా ప్రచారం ప్రారంభించాయి.. ఆ పార్టీల చీఫ్‌లు కూడా రంగంలోకి దిగనున్నారు.. మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా ఓ భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం విదితమే కాగా.. టీడీపీ-జనసేన ఉమ్మడిగా మరికొన్ని సభలు, సమావేశాలు నిర్వహించాయి.. ఇక, నేడు, రేపు గోదావరి జిల్లాల్లో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ఈ రోజు తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో.. రేపు పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రచారం సాగనుంది..
Read Also: Nitish Reddy-Pat Cummins: నితీష్ రెడ్డి అద్భుతం.. ప్యాట్ కమిన్స్ ప్రశంసలు!
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత ఉమ్మడి జిల్లాలో ఇద్దరు నేతలు సంయుక్తంగా హాజరవుతున్న సభలు ఇవే.. తణుకు నరేంద్ర సెంటర్‌లో సాయంత్రం 4 గంటలకు, నిడదవోలులో రాత్రి 7 గంటలకు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ సభల్లో పాల్గొనేందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్.. నేరుగా తణుకుకు రెండు హెలికాఫ్టర్లలో చేరుకుంటారు.. ఈ రోజు ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా పాల్గొననున్నారు.. తణుకు నుంచి నిడదవోలు వరకు జరగనున్న రోడ్ షోలో పాల్గొంటారు చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి.. నిడదవోలు గణేష్ చౌక్ లో జరగనున్న బహిరంగ సభలో ముగ్గురు నేతలు పాల్గొని ప్రసంగిస్తారు.. సభ అనంతరం నిడదవోలులోని తిరుమల సాయి కళ్యాణమండపంలో చంద్రబాబు బస చేయనుండగా.. రాజమండ్రి హోటల్లో పవన్ కల్యాణ్ బస చేస్తారు. మరోవైపు చంద్రబాబు నాయుడు అమలాపురం పర్యటన ఖరారు చేశారు.. రేపు రాత్రి 7 గంటలకు అమలాపురం చేరుకోనున్న చంద్రబాబు.. అమలాపురం గడియార స్తంభం సెంటర్ లో రాత్రి 8.30 వరకు జరగనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాత్రికి కిమ్స్ మెడికల్ కళాశాలలో బస చేయనున్నారు.. ఈ సభలో పవన్ కల్యాణ్ పాల్గొంటారా? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?