జనసేన పార్టీ 18 నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలను కేటాయించిన సంగతి తెలిసిందే. విశాఖ సౌత్, అవనిగడ్డ, పాలకొండ సెగ్మెంట్లను జనసేన పెండింగ్‌లో పెట్టింది.
మైలవరం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు మైలవరం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేవినేని ఉమాను కలుస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రకటించారు. టీడీపీ కేడర్‌ను మొత్తాన్ని కలుపుకుని ముందుకు వెళ్తానన్నారు. బొమ్మసాని సుబ్బారావు కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నపుడు తాను టీడీపీ కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టించలేదని పేర్కొన్నారు. కొండపల్లిలో మాత్రం అనుకోకుండా ఒకసారి అలా జరిగిన మాట వాస్తవమే.. అందులోనూ తన…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ, మాజీ మంత్రి సుజయ కృష్ణా రంగారావులు కలిశారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. పిఠాపురంలో రాజకీయ పరిణామాలపై పవన్-వర్మ మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.
TheyCallHimOG: ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోలు.. టాలీవుడ్ విలన్స్ గా ఎంట్రీ ఇవ్వడం ట్రెండ్ గా మారిన విషయం తెల్సిందే. ఇక ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ కూడా OG సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.
ఒంటిమిట్ట మండలంలో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం మరణంపై సందేహాలు కలిగిస్తోంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ నాయకులు చేస్తున్న భూ దందాలకు పేదలు బలైపోతున్నారు అని విమర్శలు గుప్పించారు. ఆ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి భూమి మీద హక్కులు లేకుండా చేసేశారు.
బొచ్చు గాళ్ళు వాళ్ళే వారసత్వం చేయాలా? మూడు తరాలుగా రాజకీయాలో ఉన్నాం.. నా కొడుకు ఎందుకు రాకూడదు? అని ప్రశ్నించారు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే లేకుండా ఎవడు పడితే వాడు పార్టీ పెడితే నేను వెళ్ళాలా? అని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు.
కొందరు పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు.. కొందరు ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా తీవ్ర ఆరోపణలు చేశారు. కేశినేని చిన్ని ఫోన్ ను ట్యాప్ చేస్తున్నట్టు బోండా ఉమ ఆధారాలు బయట పెట్టారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ప్రభుత్వంపై బోండా ఉమా అభియోగం మోపారు. సీతారామంజనేయులు నేతృత్వంలో ఫోన్లు ట్యాపింగ్ ప్రక్రియ జరుగుతోందని ఆరోపించారు. గతంలో తాము ఫోన్లు…
ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారయ్యారు. ఇక్కడి నుంచి జనసేన నేత చిర్రి బాలరాజు పోటీ చేయనున్నారు. ఈ మేరకు నాగబాబు ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. మూడు పార్టీలను కలుపుకుని పని చేస్తానని, పోలవరంలో భారీ మెజారిటీ సాధిస్తానని బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. కాగా.. ఇక్కడి నుంచి టీడీపీ నేత బొరగం శ్రీనివాస్ కూడా టికెట్ ఆశించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేనకు కేటాయించారు. తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన ఇంఛార్జ్ గిడ్డి సత్యనారాయణకు టికెట్ కేటాయించారు. తొలుత తెలుగుదేశం ఫస్ట్ లిస్టులో మహాసేన రాజేష్ కు గన్నవరం సీటు కేటాయించారు. మహాసేన రాజేష్ కు కేటాయించడం పట్ల తెలుగుదేశం జనసేనతో పాటు హిందూ సంఘాలు వ్యతిరేకించాయి. దీంతో టిక్కెట్ మార్పు చేశారు.
ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురం పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.. యూ కొత్తపల్లి మండలానికి చెందిన కాపు నేతలతో సమావేశం నిర్వహించారు.. కిర్లంపూడిలో తన నివాసంలో ఈ మీటింగ్ జరిగింది.. ఎన్నికల ప్రచార శైలి ఏ విధంగా ఉండాలి.. సభలు, సమావేశాలు ఎలా నిర్వహించాలి.. వాటిపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.