Akkada Ammayi Ikkada Abbayi Re Union after 27 Years: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను సినీ నిర్మాత సుప్రియా యార్లగడ్డ కలిసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె ఈరోజు నిర్మాతలతో కలిసి స్పెషల్ ఫ్లయిట్ లో గన్నవరం వెళ్లి పవన్ ను కలిశారు. నిజానికి ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’ సినిమాలో వీళ్లిద్దరూ హీరో, హీరోయిన్లుగా లాంచ్ అయ్యారు. సుప్రియ ఆ తరువాత సినిమాలకు దూరమైంది. Sapthami…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తో విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతల సమావేశం ప్రారంభమైనది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను శ్రీ పవన్ కళ్యాణ్ కి నిర్మాతలు నివేదించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు.…
పాకిస్థాన్‌లో కలకలం రేపుతున్న కాంగో వైరస్.. పాకిస్థాన్‌లో కాంగో వైరస్ కేసులు పెరుగుతున్నాయి. క్వెట్టా నుంచి తాజాగా మరో కొత్త కాంగో వైరస్ కేసు నమోదైంది. 32 ఏళ్ల రోగి ఫాతిమా జిన్నా ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేరారు. ఇప్పుడు వైద్య సంరక్షణలో ఉన్నారు. పాక్ కి చెందిన ఓ న్యూస్ ఛానెల్ ఈ విషయాన్ని వెల్లడించింది. రోగి పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని కిలా సైఫుల్లా జిల్లా కిలా సైఫుల్లా నగరంలో నివాసి అని ఆసుపత్రి వర్గాలు…
Tollywood Producers Meeting With AP Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు టాలీవుడ్ బడా నిర్మాతలు పయనమయ్యారు. హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లయిట్లో గన్నవరం బయల్దేరారు. సోమవారం కేబినెట్ సమావేశం తరువాత డిప్యూటీ సీఎంను నిర్మాతలు కలిసే అవకాశం ఉంది. విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో ఈరోజు మధ్యాహ్నం ఈ భేటీ ఉండబోతోంది. ఈ సందర్భంగా తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పవన్‌కు నిర్మాతలు వివరించనున్నారు. Also Read: Gold…
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సూపర్-6 పథకాల అమలుపై కేబినెట్ చర్చించనుంది. పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే.. చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాల ఫైళ్లను ఆమోదించనుంది కేబినెట్. అన్న క్యాంటీన్లకు ఇప్పటికే రూ. 164 కోట్ల కేటాయింపు. వచ్చే నెలలో అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించే అంశంపై కేబినెట్లో చర్చ జరుగనుంది. హామీ మేరకు పెంచిన…
TG Vishwa Prasad Says I was lucky to work with Pawan Kalyan: తాను చిన్నప్పటి నుంచి ‘మెగాస్టార్’ చిరంజీవికి పెద్ద ఫ్యాన్‌ని అని, ఆయన్ని దూరం నుంచి చూస్తే చాలనుకున్నానని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ చెప్పారు. చిరు తమ్ముడు పవన్ కల్యాణ్‌తో కలిసి పని చేసే అవకాశం తన అదృష్టమని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు మళ్లీ మంచి రోజులొచ్చాయని విశ్వప్రసాద్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి…
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం. ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు. నేడు ఆన్లైన్లో సెప్టెంబర్ నెల టిక్కెట్లు విడుదల, మధ్యాహ్నం వసతి గదుల కోటాను విడుదల చేయనున్న టీటీడీ. నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలవనున్న టాలీవుడ్ నిర్మాతలు. తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పవన్‌కు వివరించనున్న నిర్మాతలు. సినిమా టికెట్ల రేట్ల విషయంలో పవన్ కల్యాణ్‌తో చర్చించనున్న నిర్మాతలు. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీల…
శనివారం నాడు నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా పై అట్రాసిటీ కేసును త్రీ టౌన్ పోలీసులు నమోదు చేసారు. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. 29 వ వార్డు సచివాలయంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోల విషయంలో టీడీపీ నేతలు, మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో భాగంగా తనను కులం పేరిట టీడీపీ పార్టీకి చెందిన నేత తిమ్మయ్యను చైర్ పర్సన్ మాబున్నిసా దూషించారని…
అటవీ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై కట్టడిపై ఫోకస్ పెట్టాలని పవన్ ఆదేశించారు. ఇతర దేశాలకు అక్రమంగా ఎర్రచందనం తరలింపుపై ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు.