Pawan Kalyan Ram Charan in Anant Ambani Wedding: భారత దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం ఘనంగా నిన్న జరిగిన సంఘటన తెలిసిందే. ఈ వివాహానికి దేశ విదేశాలకు చెందిన సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు మాత్రమే కాకుండా వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులతో పాటు క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక ఈరోజు రిసెప్షన్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.
Anant Ambani Wedding: వేదిక దగ్గర వ్యాపారవేత్త, యూట్యూబర్ హల్‌చల్.. కేసు నమోదు
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నిన్న వివాహానికి హాజరైన రామ్ చరణ్ దంపతులు ఈరోజు రిసెప్షన్ కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. అయితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి వెళుతూ ఉన్న సమయంలో రాంచరణ్ దంపతులు కూడా వారితోనే వెళుతూ కనిపించారు. దీంతో బాబాయి అబ్బాయి ఇద్దరు ఒకే ఫ్రేమ్లో ఉన్నారని వారిద్దరిని అలా ఒక అంతర్జాతీయ వేడుకలో చూడడం ఆనందంగా ఉందని అంటూ మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఒకే ఫ్రేమ్లో బాబాయ్ అబ్బాయి అదిరిపోయారని చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదని వారు కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్ వేయండి.