Janasena Active Membership: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని ప్రకటించిన పవన్ కల్యాణ్.. అందుకు అనుగుణంగా.. టీడీపీ-జనసేన-బీజేపీ ఒకే వేదికపైకి రావడంలో ఆయన పాత్ర ఎంతో కీలక పాత్ర పోషించారు.. ఆ తర్వాత కూటమి ఘన విజయాన్ని అందుకుంది.. పోటీ చేసిన రెండు ఎంపీ స్థానాలు, 21 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించి ఊపుమీదున్న జనసేన.. ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సిద్ధం అవుతోంది.. ఈ నెల 18 నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వ మహా యజ్ఞం ఉంటుందని.. 10 రోజులపాటు ఈ నాల్గో విడత సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని ఆ పార్టీ ప్రకటించింది.. ఒక్కో నియోజకవర్గంలో 50 మంది వాలంటీర్లతో నమోదు ప్రక్రియ చేపట్టనున్నట్టు పేర్కొంది.. పవన్ కల్యాణ్ ఆశయ సాధనకు పని చేయాలని జనసేన పిలుపునిచ్చింది. సమష్టిగా పవన్ కల్యాణ్ ఆశయ సాధన కోసం పని చేద్దాం అంటూ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్..
Read Also: Wedding: కూలర్ వివాదం.. పెళ్లికి నిరాకరించిన వధువు.. వరుడి బాధ వైరల్..
పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు మనమంతా ఉన్నామనే భరోసాను క్రియాశీలక సభ్యత్వం ఇస్తుందన్నారు నాదెండ్ల.. ఇంతింతై వలుడింతై అన్నట్టుగా జనసేన పార్టీ ముందుకు సాగుతోంది.. గత ఎన్నికల్లో 100 శాతం స్ట్రయిక్ రేటుతో జాతీయ స్థాయిలో చర్చించుకునేలా పార్టీ విజయం సాధించడానికి అంతా సమిష్టిగా కష్టపడ్డాం అన్నారు.. పార్టీ అధినేత పవన్ ఆశయ సాధనకు అంతా కృషి చేయాలన్న ఆయన.. వేయి మంది క్రియాశీలక సభ్యులతో మొదలైన పార్టీ ప్రస్థానం.. నేడు 6.47 లక్షల మందికి చేరింది.. ఈ నెల 18 నుంచి ప్రారంభంకానున్న సభ్యత్వ నమోదులో 9 లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలనేది లక్ష్యం.. దీనికి అనుగుణంగా పార్టీ నాయకులు, నియోజకవర్గ నేతలు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలి.. జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యే సభ్యులను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్.
https://x.com/JanaSenaParty/status/1812120764180787308