Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు వుంటంతో పవన్ కల్యాణ్ ,బాలయ్య తమ సినిమా షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి రాజకీయ ప్రచార కార్యక్రమాలలో బిజీ అయిపోయారు.అయితే రాష్ట్రంలో ఎన్నికల తంతు ముగిసింది.ఊహించని విధంగా కూటమి ఘన విజయం సాధించింది.బాలయ్య హిందూపురం నుంచి ,అలాగే పవన్ పిఠాపురం నుంచి అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు.అలాగే పవన్ కల్యాణ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేసారు.అయితే ఎన్నికల హడావుడి ముగియడంతో బాలయ్య వరుసగా షూటింగ్స్…
Janasena Chief: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాడిన ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైంది అని ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు. 16, 347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ఫైల్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి తర్వాత అంత కేజ్ ని సంపాధించిన మరో వ్యక్తి పవన్ కల్యాణ్ అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన అందరి దృష్టిని ఆకర్షించేలా చేశారు.
ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు కసరత్తును ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలుస్తోంది. గురువారం ఆయన తిరుపతి నుంచి అమరావతికి తిరిగి వచ్చాక ఎవరికి ఏ శాఖలు కేటాయించిందీ ప్రకటించనున్నారు.
Mega Family at Pawan Kalyan Swearing Cermony: ఆనంద భాష్పాలు, ఆత్మీయ ఆలింగనాలు, గర్వించే క్షణాలు, ప్రధాని సమక్షంలో అపురూప సన్నివేశాలు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం మెగా ఫ్యామిలీకి మోస్ట్ మెమరబుల్ ఈవెంటుగా నిలిచిపోయింది. Jailer 2: ఒకే ఫ్రేములో ముగ్గురు సూపర్ స్టార్లు.. జైలర్ 2కి రెండు క్యామియోలు దొరికేశాయ్! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం మెగా కుటుంబానికి పండుగ కళ తెచ్చింది. అపురూప సన్నివేశాన్ని ప్రత్యక్ష్యంగా చూసేందుకు కుటుంబం…
డిప్యూటీ సీఎం పదవి చాలా కాలం నుంచి ఉంది. చాలా మంది ముఖ్యులు ఈ బాధ్యతను స్వీకరించారు. చాలా సంకీర్ణ ప్రభుత్వాల్లో డిప్యూటీ సీఎం పదవి ఉండేది. అనుగ్రహ నారాయణ్ సిన్హా భారతదేశపు మొదటి డిప్యూటీ సీఎంగా రికార్డు కెక్కారు.
ప్రస్తుతం దేశంలోని 14 రాష్ట్రాల్లో 23 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పదవిపై చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవి వరిస్తుందని అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.