Legendary Actor Anupam Kher joins epic Saga Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పీరియాడికల్ యాక్షన్ చిత్రానికి మరో అదనపు ఆకర్షణ తోడైంది. లెజెండరీ భారతీయ నటులలో ఒకరైన అనుపమ్ ఖేర్ ‘హరి హర వీరమల్లు’లో భాగమయ్యారు. ఈ చిత్రంలో ఆయన అత్యంత విలువైన, గౌరవనీయమైన పాత్ర పోషిస్తున్నట్టు టీం అధికారికంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనకు వెళ్లనున్నారు. కర్ణాటక అటవీ శాఖ మంత్రితో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్ణాటక అటవీ మంత్రితో పవన్ కళ్యాణ్ చర్చలు జరపనున్నారు.
చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన విడుదల చేశారు. చేనేతకు జీవం పోయాలని ఆయన సూచించారు. దేశంలో అతిపెద్ద అసంఘటిత ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే రంగాల్లో చేనేత ఒకటి అని.. చేనేత ఒక కళాత్మకమైన పరిశ్రమ అంటూ చెప్పుకొచ్చారు.
Guess the Celebrity with Pawan Kalyan and Renu Desai: ఒక్కోసారి పాత ఫోటోలు చూస్తే భలే ఆసక్తికరం అనిపిస్తాయి. ఇప్పుడు అలాంటిదే ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ సహా అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహ రెడ్డి హాజరైన ఒక ఈవెంట్లో పవన్ కళ్యాణ్ పక్కన కూర్చున్న ఒక చిన్న పాప ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ పాప ఇంకా ఎవరో కాదు మెగా…
Harish Shankar on Ustaad Bhagat Singh: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందులో డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా ఒకరు. సందర్భం వచ్చినప్పుడల్లా పవన్‌పై హరీశ్ తన అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా మరోసారి పవన్‌పై అభిమానం చూపారు. ఒక్కసారి పవన్ అభిమాని అయితే.. కట్టె కాలేవరకు ఆయనకు ఫ్యాన్‌గానే ఉంటాడు అని చెప్పారు. ఆయనతో గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయడం గర్వంగా ఉందని హరీశ్…
విశాఖపట్నంలో ఈ రోజు వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో.. ఆ ఐదుగురు కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలకు డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. పార్టీ కండువా కప్పి.. జనసేన పార్టీలోకి ఆహ్వానించారు..
కలెక్టర్ట కాన్ఫరెన్స్‌లో వివిధ శాఖల అధికారులకు చురకలు అంటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాంతిలాల్ దండేకు క్లాస్ తీసుకున్నారు సీఎం చంద్రబాబు. దండే ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో కొన్ని అంశాలు ప్రస్తావించ లేదన్న సీఎం.. ఏపీలో మొత్తం 12 వేల కిలోమీటర్ల మేర స్టేట్ హైవేస్ ఉంటే.. 1000 కిలో మీటర్ల పీపీపీ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు దండే పేర్కొనడంపై స్పందిస్తూ.. 1000 కిలో మీటర్లు ఏ మూలకు సరిపోవన్నారు చంద్రబాబు.
భారీ ఎత్తున చెట్లు నాటే కార్యక్రమం చేపట్టాలి. ఒకేసారి ఐదు లక్షలు.. పది లక్షల చెట్లు నాటేలా వన మహోత్సవాలను కార్యక్రమం చేపట్టాలి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..