Sai Dharam Tej about Pawan Kalyan in Usha Parinayam Pre Release Event: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మంగళగిరిలో హీరో సాయి దుర్గా తేజ్ ఉత్సాహంతో తన మేనమామ పవన్ను హగ్ చేసుకుని.. అనంతరం ఎత్తుకున్నారు. ఇందుకు సంబంధిత విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జనసేనాని విజయం సాధించిన రోజు ఆయన్ను ఎత్తుకోవడంపై…
భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్కు అభినందనలు తెలుపుతూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
తిరుపతి జిల్లా వెంకటగిరిలో యువతులను, వృద్ధులను వేధిస్తున్న ఆకతాయిలని అదుపు చేయాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలకు తిరుపతి పోలీసులు తక్షణం స్పందించారు. వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీకి వెళ్ళి అక్కడి ప్రజలతో పోలీసులు మాట్లాడారు. ఆకతాయిల వివరాలు నమోదు చేసుకున్నారు.
తన కార్యాలయానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి ఉప ముఖ్యమంత్రి తన కార్యాలయ సిబ్బందితో కలసి ప్రతి అర్జీని చదువుతున్నారు.
Niharika Konidela About Pawan Kalyan: కొణిదెల నిహారిక ఇప్పుడు సినిమాతో ఫుల్ బిజీగా కనపడుతోంది. ఈవిడ మొదట సినీ కెరియర్ లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి వాటి ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆపై నాగ శౌర్యతో నటించిన “ఒక మనసు” సినిమాతో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ మీదకు అడుగు పెట్టింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందన విషయం పక్కన పెడితే.. సినిమాలో మాత్రం నిహారిక నటనకు మంచి…
Renu Desai Meets Telangana Minister Konda Surekha: నేడు శుక్రవారం జులై 26న ప్రముఖ నటి, హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిసింది. హైదరాబాదులో కొండా సురేఖ ఉన్న ఇంటికి వెళ్లిన రేణు దేశాయ్ అక్కడ వన్నెప్రాణుల సంక్షేమం, పర్యావరణం, ఆధ్యాత్మిక రంగాలలో లాంటి అనేక విషయాలపై వారు చర్చించారు. ఇకపోతే రేణుదేశాయ్ భగవద్గీత ఫౌండేషన్ ఫర్…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.. 16వ శాసన సభ మొదటి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. మొత్తం 27 గంటల 28 నిముషాల పాటు సభ కార్యక్రమాలు జరిగాయని వెల్లడించారు.. శాసన సభలో సభ్యులు 36 ప్రశ్నలు ప్రభుత్వానికి సంధించారని.. అందులో స్వల్ప వ్యవధి ప్రశ్న ఒకటిగా పేర్కొన్నారు..
వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు ఉన్న వారు నిల్చొవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనడంతో అసెంబ్లీలో దాదాపు 80 శాతం మంది ఎమ్మెల్యేలు.. సభలో లేచి నిల్చున్నారు.. దీంతో.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కసారిగా నవ్వులు పూశాయి..
మంత్రులు, ఉన్నతాధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసింది.. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పరిపాలనపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు.. కేంద్రం నుంచి వచ్చే ఏ ఒక్క రూపాయిని వదలకుండా పూర్తి స్థాయిలో కేంద్ర పథకాలను అధ్యయనం చేయాలని వెల్లడించారు ముఖ్యమంత్రి.. మూసధోరణిలో కాకుండా వినూత్నంగా ఆలోచన చేయాలని సూచించారు.