Mahesh fans Targeting Pawan Kalyan Gabbar Singh Re Release Target: కొత్త సినిమాలేమో గానీ, రీ రిలీజ్ సినిమాలతో ట్రెండ్ సెట్ చేయడం తెలుగు హీరోలకు మాత్రమే సాధ్యం అని చెప్పక తప్పదు. మామూలుగా అయితే.. కొత్త సినిమాల రికార్డ్స్ విషయంలో హీరోలు పోటీ పడుతుంటారు. ఫ్యాన్స్ కూడా రచ్చ చేస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం రీ రిలీజ్ రికార్డుల విషయంలోను తగ్గేదేలే అంటున్నారు. ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాలు చూస్తే.. మహేష్, పవన్ ఫ్యాన్స్ నువ్వా నేనా అన్నట్టుగా థియేటర్లకు పరుగులు పెడుతూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ అయిన ‘మురారి’ సినిమా.. ఫస్ట్ డే 5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఆల్ టైం రికార్డ్ సెట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన ఇంద్ర సినిమా ఈ రికార్డ్‌ను బ్రేక్ చేస్తుందని అనుకున్నారు. కానీ ఇంద్ర 3 కోట్ల దగ్గరే ఆగిపోయింది. అయితే.. పవర్ స్టార్ బర్త్ డే నాడు రీ రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ మాత్రం మురారిని బీట్ చేసి.. ఏకంగా ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలుపుకొని 8 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం రికార్డ్ తన పేరిట రాసుకుంది.
A.R Rahman: లైవ్‌లో రెహమాన్ గూస్‌బంప్స్.. ఆగలేకపోతున్నాం మావా!!
దీంతో.. ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ రికార్డ్‌ను బీట్ చేయడానికి పక్క ప్లానింగ్ రెడీ చేసుకుంటున్నారు. గబ్బర్ సింగ్ తరహాలోనే మహేష్ బాబు నెక్స్ట్ బర్త్ డేకి గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఆల్రేడీ 2025 మహేష్ బర్త్ డేకి ‘అతడు’ రీ రిలీజ్ కన్ఫామ్ చేసుకున్నారు ఘట్టమనేని అభిమానులు. బర్త్ డేకి ఒక రోజు ముందే ఆగస్ట్ 8న ప్రీమియర్స్ పడేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే.. అసలు ఈ స్టార్ హీరోల కొత్త సినిమాలు అనుకున్న సమయానికి వచ్చి ఉంటే.. ఈ రీ రిలీజ్‌లు ఉండేవి కాదు. కానీ పవన్ సినిమాలు పాలిటిక్స్ కారణంగా డిలే అవుతుండగా.. మహేష్, రాజమౌళి సినిమా రావడానికి మరో మూడు నాలుగేళ్ల సమయం పట్టేలా ఉంది. కాబట్టి.. అప్పటి వరకు అభిమానులు రీ రిలీజ్ సినిమాలతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే.. టాలీవుడ్‌లో రీ రిలీజ్‌కు యమా క్రేజ్ ఉందని చెప్పొచ్చు.