ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు వరుస సమీక్షలతో బిజీబిజీగా గడపనున్నారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి 8 వరకు శాఖల వారీగా అధికారులతో సమావేశం కానున్నారు. ఉదయం పది గంటలకు కలెక్టర్లతో భేటీ కానున్నారు. కలెక్టర్ల సదస్సులో ప్రారంభోత్సవం చేయనున్నారు సీసీఎల్ఏ జయలక్ష్మి, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. కలెక్టర్లను ఉద్దేశించి సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడనున్నారు.
పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వినతులు ఎన్ని ఉన్నా... అన్నింటి పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నాయన.. గత ఐదేళ్ల కాలంలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. రెవెన్యూ సమస్యలకు కారణమై, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు..
Committee Kurrollu Konidela Niharika: మెగా ఫ్యామిలీ కూతుర్లలో ఒకరైన నిహారిక కొణిదెల, భర్త చైతన్య జొన్నలగడ్డతో విడిపోయిన తర్వాత కెరీర్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు నటిగా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగానూ తన సత్తా చాటుతోంది. నిహారిక తాజా చిత్రం కమిటీ కుర్రాళ్లు. యాదు వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సందీప్ సరోజ్, యశ్వంత్, ఈశ్వర్ త్రినాథ్, సాయి కుమార్ లు ప్రధాన పాత్రలు పోషించారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ…
Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన ప్రారంభమయ్యాక పెంచిన సామాజిక పింఛన్లను రెండో నెలలోనూ విజయవంతంగా లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పంపిణీ చేశారు అని ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు.
పిఠాపురం మహారాజా వారసులకు చెందిన ఆస్తుల కబ్జాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. వెంటనే విచారణ చేయాలని కలెక్టర్, ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. వివాదంలో ఉన్న ఇంటికి వెళ్లి ఆర్డీవో కిషోర్ విచారణ చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చామని.. ఈ ఆస్తికి సంబంధించి వివాదం కోర్టు పరిధిలో ఉందని.. ప్రస్తుతం ఉన్న జడ్జిమెంట్ ప్రకారం ఈ ప్రాపర్టీ చంద్రలేఖ కుటుంబానికి చెందినదని.. శాఖా పరంగా విచారణ…
Renu Desai Shocking Comments on Second Marriage: హీరోయిన్గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన రేణు దేశాయ్ ఆ తర్వాత కొన్నాళ్లకు హీరో పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత వీరు సహజీవనం చేసి ఇద్దరు పిల్లలకు జన్మను కూడా ఇచ్చారు. ఆ తర్వాత వివాహం చేసుకున్నా అనుకోని పరిస్థితుల్లో విడాకులు తీసుకున్నారు. ఇక తర్వాత రేణు దేశాయ్ పిల్లలతో పాటు పూణే హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేస్తుంది. కొన్నాళ్లపాటు పూణేలో ఉంటుంటే…
AP Deputy CM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌కు ఊరట లభించింది. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై గుంటూరులో ఆయనపై కేసు నమోదు అయింది. ఈ
పింఛన్ల లబ్ధిదారులకు ఒక్కరోజులోనే పంపిణీ పూర్తి చేయాలని గైడ్ లైన్స్ విడుదల చేసింది ఏపీ సర్కార్.. పెన్షన్ల పంపిణీపై మార్గదర్శకాలను విడుదల చేసింది గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ. ఆగస్టు 1వ తేదీన తెల్లవారు జామున 6 గంటలకే పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేయాల్సి ఉంటుందని.. రాష్ట్రంలోని అన్ని సచివాలయాల సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం..
పిఠాపురం నియోజకవర్గంలో.. వైసీపీకి భారీ షాక్ తగలబోతోందట.. వైసీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఉన్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి.. దీనిపై తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నారట పెండెం దొరబాబు.