Pawan Kalyan Announced 6 Crores Donation for Telugu States: పవర్ స్టార్ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పెద్ద మనసు మరోసారి చాటుకున్నారు. నిజానికి గత కొద్దిరోజులుగా కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు వరదమయమైన పరిస్థితి కనిపిస్తోంది. విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఇంకా వరద నీరు తగ్గక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఆయన నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి రూపాయలు పర్సనల్గా విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన పవన్ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి కూడా మరో కోటి రూపాయలు ఇస్తున్నట్లుగా ప్రకటించారు.
Puri Jagannadh: పూరి జగన్నాధ్ పరిస్థితి ఏంటి?
ఇక అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 400 పంచాయతీలు వరద బారిన పడ్డాయి అనే విషయం తెలుసుకున్న ఆయన 400 పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. కోటి రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపిన తర్వాత లక్ష చొప్పున ఆ 400 పంచాయతీలకు స్వయంగా తానే నేరుగా డబ్బు పంపిస్తానని ప్రకటించారు. ఇక ఈ లెక్కన పవన్ కళ్యాణ్ మొత్తం 6 కోట్ల రూపాయలు వరదల నిమిత్తం విరాళం ఇచ్చినట్లయింది. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించడం లేదని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. వాటికి కూడా పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. తాను రంగంలోకి దిగితే రెస్క్యూ చర్యలకు ఇబ్బంది కలుగుతుందని అధికారులు తనకు నివేదించిన నేపథ్యంలో తాము రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొనడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.