Ustad Bhagat Singh : ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ ఎఫెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై పడినట్టుగా.. ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మిరపకాయ్ తర్వాత మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. వాస్తవానికైతే.. హరీష్ శంకర్ ముందుగా పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కంప్లీట్ చేయాల్సి ఉంది. కానీ పవన్ రాజకీయంగా బిజీ అవడంతో.. ఈలోపు మిస్టర్ బచ్చన్‌ను టేకప్ చేశాడు హరీష్. జెట్ స్పీడ్‌లో ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేశాడు. కానీ సీన్ రివర్స్ అయింది. ఇక్కడి నుంచి ఉస్తాద్ పై కూడా డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే.. ఈ సినిమా తేరి రీమేక్ అనే టాక్ ఉంది. కానీ ఉస్తాద్ విషయంలో హరీష్ రీమేక్ మార్క్ మిస్ అయింది.
Read Also:Bus Accident: పల్లె వెలుగు బస్సు బోల్తా.. ప్రయాణీకులకు గాయాలు
దీంతో.. ఉస్తాద్‌తో హరీష్ మెప్పిస్తాడా? అనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే కొంత వరకు ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. త్వరలోనే పవన్ సెట్స్ పై ఉన్న సినిమాలు కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఉస్తాద్ మేకర్స్ కూడా పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఉస్తాద్ స్క్రిప్టులో మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తన రైటర్స్ టీమ్‌తో హరీష్ ఇదే విషయంపై చర్చలు జరుపుతున్నాడనేది ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. ప్రజెంట్ హరీష్ శంకర్ ఫోకస్ మొత్తం ఉస్తాద్ పైనే ఉందని అంటున్నారు. ఎట్టి పరిస్థితిల్లోను ఉస్తాద్‌తో దుమ్ముదులిపేయాలని హరీష్ భావిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్‌కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఏపి ఎన్నికల సమయంలో గాజు గ్లాస్‌ను హైలెట్ చేస్తూ కట్ చేసిన గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. కాబట్టి.. గబ్బర్ సింగ్ రిజల్ట్‌ను ఈ సినిమాతో హరీష్ శంకర్ రిపీట్ చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. అయితే.. ఉస్తాద్ స్క్రిప్టులో మార్పులు ఎంత వరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.
Read Also:CM Revanth Reddy: ఖైరతాబాద్ మహాగణపతికి సీఎం రేవంత్ రెడ్డి తొలిపూజ..