కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సైతం పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారట.. రేపు వైసీపీకి రాజీనామా చేయనున్నారట జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే ఉదయభాను.. ఈ నెల 22వ తేదీన జనసేన పార్టీలో చేరతారని ప్రచారం సాగుతోంది.. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో టచ్‌లోకి వెళ్లారట ఉదయభాను.. రేపు నియోజక వర్గంలో కార్యకర్తలతో సమావేశం కానున్న ఉదయభాను.
విజయవాడలో గురువారం రోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలుస్తానని బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. తన భవిష్యత్ కార్యాచరణను కూడా అక్కడే ప్రకటిస్తానన్నారు. గతంలో తాను పార్టీలోని కొందరు వ్యక్తుల వల్ల పడుతున్న ఇబ్బందులు పలు సందర్బాల్లో ప్రస్తావించిన బాలినేని.. పార్టీలో తనకు జరిగిన అన్యాయాలను త్వరలో వివరిస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం.. కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం తెలిపింది.. ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. 100లోపు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవాలని మంత్రివర్గం నిర్ణయించింది.. రూ.99కే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
AP Government 100 Days: ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎన్డిఏ శాసనసభా పక్ష సమావేశం రేపు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో జరగనుంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి హాజరయ్యే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, లోటుపాట్లపై చర్చించనున్నారు ఎన్డిఏ శాసనసభా పక్ష నేతలు. ఈ నెల 20 నుంచి 26 వరకు…
Janasena Suspends Jani Master with Immediate Effect: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఒక లేడీ కొరియోగ్రాఫర్ రేప్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తనను పలు సందర్భాలలో పలు ప్రాంతాలలో రేప్ చేశాడని తర్వాత మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని వేధించాడని సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ యువతి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ మీద కేసు నమోదు చేశారు. ఆయన కోసం గాలిస్తున్నారు ప్రస్తుతానికి…
లీడర్ అంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాగా స్పందించే మనసు ఉండాలి అన్నారు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. రాష్ట్రంలో వరదలు, వర్షాలతో భారీగా నష్టం జరిగింది.. లక్షలాది మంది ప్రజలు ముంపు బారిన పడ్డారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవంతో ఈ విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించారు.. కానీ, వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శలు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
KBC Question on Pawan Kalyan: బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 16వ సీజన్ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ షోలో భాగంగా ఇటీవలి ఎపిసోడ్లో ఒలింపిక్స్‌పై ప్రశ్నను అడిగిన బిగ్‌బీ.. తాజాగా పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సంబందించిన ప్రశ్నను అడిగారు. అయితే కంటెస్టెంట్ ఈ ప్రశ్నకు ‘ఆడియన్స్ పోల్’ ఆప్షన్ తీసుకుని.. 1.60 లక్షలు గెలుచుకున్నాడు. ఇంతకీ అమితాబ్ ఏం ప్రశ్న…
AP Deputy CM: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో 10వ రోజు సహాయక చర్యలు.. సీఎం సమీక్ష వరద ప్రభావిత ప్రాంతాల్లో 10వ రోజు అందుతున్న సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు.. సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి భారీవర్షాలు, ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా కలెక్టర్లు.. అధికారులకు కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు.. వరద ముంపుపై ఎన్యుమరేషన్ రేపు సాయంత్రానికి…