Chandrababu and Pawan Kalyan as Guests for Unstoppable With NBK 4: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోల్డెన్ పీరియడ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన సినిమాలు చేసినా, టాక్ షోలు చేసినా సూపర్ హిట్ అవుతున్నాయి. అంతేకాదు రాజకీయంగా కూడా ఆయనకు మంచి టైం నడుస్తోంది. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా హిందూపురం నుంచి ఆయన మరోసారి గెలుపొందారు. ఇక అసలు విషయానికి వస్తే ఆహా ఒరిజినల్ షోగా అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె అనే ఒక షో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో కి సంబంధించిన నాలుగవ సీజన్ అనౌన్స్మెంట్ దసరా రోజున ఘనంగా జరిగింది. నందమూరి బాలకృష్ణ స్వయంగా హాజరై ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ఈ నాలుగో సీజన్ గురించి అనేక రకాల లీకులు బయటకు వస్తున్నాయి. తాజాగా ఒక సంచలన లీక్ అయితే వెల్లడైంది. అదేంటంటే ఈ సీజన్ కి సంబంధించి గెస్ట్ ల లిస్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారని తెలుస్తోంది.
నిజానికి గత సీజన్లలోనే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ తో ఒక ఎపిసోడ్ చేశారు బాలకృష్ణ. అలాగే పవన్ కళ్యాణ్ తో మరొక ఎపిసోడ్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబుని కలిపి ఒక ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వీలైనంతవరకు అది లాంచింగ్ ఎపిసోడ్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది ఆహా టీం. దీనికి సంబంధించిన షూట్ ఇంకా జరగాల్సి ఉంది. అయితే ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయితే గాని చెప్పలేం. ఇక ఈ సీజన్లో మెగాస్టార్ చిరంజీవిని కూడా తీసుకువచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యం బాలేదు. ఆయన కాస్త కుదుట పడిన తర్వాత ఆయనతో ఈ షో ఎపిసోడ్ ప్లాన్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది.