OG Movie : ఓజీ.. ఆన్ షూటింగ్.. వైరల్ అవుతున్న ఫోటోస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OG Movie : ఓజి.. ఈ పేరు వింటేనే పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. ఓజాస్ గంభీర అనే పాత్రలో కనిపించనున్నారు. ముంబై బ్యాక్ డ్రాప్‌లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఓజి తెరకెక్కుతోంది. పవర్ స్టార్‌ను ఒక డై హార్డ్ ఫ్యాన్ ఎలా అయితే చూడాలి అనుకుంటున్నాడో.. అంతకుమించి చూపించబోతున్నాడు దర్శకుడు సుజీత్. మొదట్లో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టడమే ఆలస్యం అన్నట్టు.. జెట్ స్పీడ్‌లో షూటింగ్ చేశారు మేకర్స్. అంతేకాదు.. మొన్న దేవర రిలీజ్ అయిన డేట్ సెప్టెంబర్ 27న ఓజిని రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. కానీ పవన్ రాజకీయంగా బిజీ అవడంతో.. సినిమా షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేగా, ఏపి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తునే.. కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్.
Read Also:PAK vs ENG: అదరగొట్టిన పాకిస్తాన్ స్పిన్నర్లు.. ఇద్దరే 20 వికెట్స్ పడగొట్టారు!
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
ఇప్పటికే విజయ వాడలో హరిహర వీరమల్లు షూటింగ్ స్టార్ట్ కాగా.. హైదరాబాద్‌లో రామోజీ ఫిలిం సిటీలో ఓజి షూటింగ్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఓజికి సంబంధించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. అయితే.. పవన్ ఇంకా ఈ షూటింగ్‌లో జాయిన్ అవలేదు. ఈలోపు పవన్ లేని సీన్స్ కంప్లీట్ చేస్తున్నాడు సుజీత్. షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నారు డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు. ఓజి సెట్స్‌లో దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు తమన్, డివోపి రవి కె. చంద్రన్ డిస్కస్ చేస్తున్న కొన్ని పిక్స్ షేర్ చేశారు. అలాగే.. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టుగా మరో అప్డేట్ ఇచ్చారు. ఇప్పుడే కాదు.. గతంలో కూడా ఓజి షూటింగ్ సమయంలో సూపర్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పుడు కూడా అదే జోష్‌లో ఉన్నారు. దీంతో.. ఓజి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
The Boys are all in! 🔥🔥#Sujeeth @MusicThaman @dop007#OG #TheyCallHimOG pic.twitter.com/x10Wx8xobz
— DVV Entertainment (@DVVMovies) October 17, 2024
తాజావార్తలు
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!