Balineni Srinivas Reddy : పిఠాపురం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ తనకు తీవ్ర అన్యాయం చేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తన మంత్రి పదవి తీసేశాడని.. అయినా సరే తాను బాధపడలేదన్నారు. తనను జనసేనలోకి తీసుకొచ్చింది నాగబాబు అని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ వెంట తాను నడుస్తానని.. ఎలాంటి పదవులు ఆశించి జనసేనలోకి రాలేదన్నారు. జనసేన కోసం…
Nagababu : తాను బతికినంత కాలం పవన్ కల్యాణ్ ఫాలోవర్ గానే ఉంటానని మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు చెప్పారు. పిఠాపురంలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభలో నాగబాబు మాట్లాడారు. మన హిందూ ప్రజలకు 12వ ఏడాది చాలా స్పెషల్ అని నాగబాబు చెప్పుకొచ్చారు. 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తుంటాయని.. ఈ 12వ ఆవిర్భావ సభ కూడా జనసేనకు పుష్కరాల్లాంటిదేనన్నారు. ఈ సభ గతంలో జరిగిన చాలా సభలకంటే చాలా గొప్పది అంటూ చెప్పుకొచ్చారు.…
తనకు పని చేయడం తప్ప విజయం గురించి తెలియదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అటువంటి తనకు పిఠాపురం ప్రజలు ఘన విజయం ఇచ్చారని.. తన గాయాలకి పిఠాపురం ప్రజలు మందు వేశారని కొనియాడారు. జన్మంతా పిఠాపురం ప్రజలకి రుణపడి ఉంటానని తెలిపారు. నేడు పిఠాపురం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించారు. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆ శాఖ కమిషనర్ కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు.
Brahmaji Indirect Tweet on TDP Attacks: ఆంధ్రప్రదేశ్లో ఇంకా నూతన ప్రభుత్వం ఏర్పడక ముందే చాలా చోట్ల వైసీపీ శ్రేణుల మీద దాడులు జరుగుతున్నట్లుగా ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పటివరకు పలువురు నేతలు మాత్రమే స్పందిస్తూ ఉండగా తాజాగా వైఎస్ జగన్ కూడా ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్స్ వేదికగా స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి.…
ఏపీ ఛీఫ్ ఎలక్టోరల్ అధికారికి బీజేపీ లేఖ రాసింది. అమిత్ షా పబ్లిక్ మీటింగ్ స్పీచ్ ను ఫేక్ చేసారంటూ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ (X) అకౌంట్ పై కంప్లైంట్ చేసింది. రిజర్వేషన్ లు ఎత్తేస్తారంటూ అమిత్ షా మాట్లాడినట్లు సృష్టించారని కంప్లైంట్లో పేర్కొంది.
జగనన్న అందిస్తున్న నవరత్నాలు మరింత ప్రకాశవంతంగా మెరిసే విధంగా ఈ మేనిఫెస్టోను రూపకల్పన చేశారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఈ రోజు పశ్చిమగోదావరిజిల్లా తణుకులో ఆయన మాట్లాడుతూ.
బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుపై ఆయా పార్టీల అధినేతలు జేపీ నడ్డా, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మోడీ, బీజేపీ, టీడీపీ, జనసేన దేశ ప్రగతికి, ఏపీ ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాయన్నారు. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ప్రధాని మోడీ గత 10 సంవత్సరాలుగా దేశాభివృద్ధి ప్రగతి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారన్నారు. బీజేపీతో టీడీపీ-జనసేన కలిసి రావడం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను చేరుకోవడానికి సహాయం…
దీక్ష చేసే ముందు ఎంత వరకు మన అర్హత ఉందో చూసుకోవాలి అని స్పీకర్ తమ్మనేని సీతారం అన్నారు. నారా భువనేశ్వరి బస్సు యాత్ర కాకపొతే హెలికాప్టర్ యాత్ర చేసుకోమనండి.. అది వాళ్ళ ఇష్టం.. తప్పు చేసి మోసం చేయాలని చూస్తే ఊరుకునే పరిస్థితి లేదు అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆరు నెలలు ఓపిక పట్టండి.. ఎన్నికలలో ప్రజలు ఊహించనంత తీర్పు ఇస్తారు.