ఏపీ ఛీఫ్ ఎలక్టోరల్ అధికారికి బీజేపీ లేఖ రాసింది. అమిత్ షా పబ్లిక్ మీటింగ్ స్పీచ్ ను ఫేక్ చేసారంటూ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ (X) అకౌంట్ పై కంప్లైంట్ చేసింది. రిజర్వేషన్ లు ఎత్తేస్తారంటూ అమిత్ షా మాట్లాడినట్లు సృష్టించారని కంప్లైంట్లో పేర్కొంది. మైనారిటీ రిజర్వేషన్ గురించి మాట్లాడిన అంశాన్ని ఎస్సీ, ఎస్టీలకు ఆపాదిస్తూ.. ఫేక్ వీడియో తయారు చేసారని లేఖలో రాసింది. కాంగ్రెస్ సోషల్ మీడియా యాక్టివిస్టులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ కోరింది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు తయారు చేస్తున్న ఫేక్ వీడియోలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంది.
READ MORE: Aamani: భర్తతో విడిపోవడానికి కారణం ఇదే.. విడాకుల వెనక కారణం చెప్పిన ఆమని
అయితే కాంగ్రెస్ తన ఎక్స్ ఖాతాలో అమిత్ షా ఓ బహిరంగ సభలో మాట్లాడిన వీడియోను పోస్టు చేసి.. దాని కింద “మతం పేరిట రాజకీయాలు చేస్తున్న బీజేపీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ సోదర సోదరీమణులారా.. బీజేపీకి ఓటు వేయాల వద్దా అనేది ఈ వీడియో చూశాక నిర్ణయం తీసుకోండి. భారత రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తూ.. పొగరు, అహంకారంతో మళ్లీ అధికారంలోకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీల రిజర్వేషన్లు..” ఇలా రాసుకొచ్చింది. దీంతో ఆగ్రహానికి గురైన బీజేపీ నాయకులు వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఎన్నికల్లో ప్రత్యక్ష ప్రచారం ఎంత ముఖ్యమో.. సోషల్ మీడియా, మీడియా ద్వారా ప్రచారం చేయడం కూడా అంతే ప్రాధాన్యంగా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ప్రతి పార్టీకి ప్రత్యేకంగా సోషల్ మీడియా వింగ్ లు ఉన్నాయి. తమ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, చేసిన మంచి పనులు తెలిపేందుకు ఈ సోషల్ మీడియా వర్కర్లు వీడియోలు, ఫొటోల రూపంలో ఎడిట్ చేసి ఆయా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుంటారు. కొన్ని సార్లు ప్రతిపక్ష నాయలకులకు సంబంధించి వీడియోలు, ఫోటోలను సైతం వాడుకుంటుంటారు. ఇది ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇది. మితి మీరితే పెద్ద దెబ్బ పడే అవకాశం లేకపోలేదు.