దక్షిణ కొరియాలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 6గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
త్వరలో దేశ వ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికలకు నిర్వహించేందుకు సర్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
షెడ్యూల్డ్ తెగలకు చెందిన నకిలీ పత్రాలతో (Fake Caste Certificates) లబ్ధి పొందే అనర్హులపై చర్యలు తీసుకునేలా పార్లమెంటరీ కమిటీ (Parliamentary Panel) కేంద్రానికి సూచించింది.
రేపు సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఢిల్లీలో ఉదయం 9.30 గంటలకు ఈ మీటింగ్ జరగనుంది. పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన డిమాండ్‌పై ప్రతిపక్షాలు, బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తమకు వచ్చిన ఓట్లు, సీట్లు చూస్తే రాబోయే కాలంలో బీజేపీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో అధికారం సాధించే దిశలో పయనిస్తుందని తెలిపారు. డబ్బు, మద్యం ప్రభావంను పక్కన పెట్టి ప్రజలు బీజేపీకి విజయాన్ని కట్ట బెట్టారని అన్నారు. బీజేపీకి ఓటు వేసిన ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు శాతం…