Delhi: 2024 ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలో దేశ వ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
పార్లమెంట్ (Parliamentary), అలాగే ఆయా రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల (State Assembly Elections) కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని (EC) వెల్లడించారు. దేశ వ్యాప్తంగా చేయాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు రాజీవ్ కుమార్ (Rajiv Kumar)చెప్పుకొచ్చారు.
Also Read
- LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
- India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్‌లో కీలక టెస్ట్..
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
ఒడిశా అసెంబ్లీపై..
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 50% పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం ఉంటుందని తెలిపారు. 22,685 పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. 300 పోలింగ్ స్టేషన్లు వికలాంగుల కోసం ఏర్పాటు చేసినట్లు రాజీవ్ కుమార్ చెప్పుకొచ్చారు.
వచ్చే నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి మే నెలలో రిజల్ట్స్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా ఆయా పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఓ వైపు ఎన్డీఏ.. ఇంకోవైపు ఇండియా కూటమి ఎన్నికల్లో గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కమలనాథులు సమావేశమయ్యారు. 2024 ఎన్నికల్లో 400 సీట్లు గెలుపొందడం కోసం ఏం చేయాలన్నదానిపై మేథోమదనం చేస్తున్నారు. ఇప్పటికే మోడీ పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇంకోవైపు విపక్ష పార్టీలు కూడా ఇండియా కూటమిగా ఏర్పడ్డారు. కానీ.. వారిలో ఐక్యత లోపించింది. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా వ్యవహరిస్తు్న్నారు. తృణమూల్ కాంగ్రెస్, ఆప్, సమాజ్‌వాదీ పార్టీలు కూటమిలో ఉన్న కూడా సొంతంగా బరిలోకి దిగుతున్నారు. దీంతో బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పడ్డ కూటమి కాస్తా బలహీనపడింది. ఇండియా కూటమిలోని అనైక్యతను క్యా్ష్ చేసుకునేందుకు కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ఎలా ముందుకు సాగుతుందో వేచి చూడాలి.
ఇక కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర అంటూ దేశ వ్యాప్తంగా తిరుగుతున్నారు. ఈ యాత్ర కాంగ్రెస్‌కు ఎంత మైలేజ్ ఇస్తుందో వేచి చూడాలి.
#WATCH | Chief Election Commissioner Rajiv Kumar says, " …We are fully prepared to conduct 2024 Parliamentary elections and state Assembly elections. All the preparations are almost complete" pic.twitter.com/558LkXUgXm
— ANI (@ANI) February 17, 2024
#WATCH | Bhubaneshwar, Odisha: On Odisha Assembly elections, Chief Election Commissioner Rajiv Kumar says, " In 50% of polling stations, there will be webcasting facility. Out of 37809, polling stations, there will be webcasting arrangements on 22,685 polling stations…person… pic.twitter.com/vQWgFD0KJ8
— ANI (@ANI) February 17, 2024
తాజావార్తలు
-
Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్‌పైనే ఆశలు!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
-
Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
-
Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!