Parliament Monsoon Session 2022: ఈనెల 18న వర్షాకాల సమావేశాలు.. అదేరోజు రాష్ట్రపతి ఎన్నిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూలై 18న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అయితే అదేరోజు రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈనేపథ్యంలో.. వీటిని దృష్టిలో పెట్టుకుని 17వ తేదీ ఉదయం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ నిర్ణయించింది. అయితే.. సంబంధిత మంత్రి ప్రహ్లాద్ జోషి, సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులు.. ఎజెండాలోని ఇతరత్రా అంశాల గురించి ఆయా పార్టీల నేతలకు వివరించి, వారి సహకారం కోరనున్నారు. ఈకార్యక్రమంలో.. ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగా అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారు. జూలై 18న (అదే రోజు) సాయంత్రం 6 గంటలకు రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి భవన్‌లో ఎగువసభా పక్ష నేతలతో భేటీ అవుతారు. సమావేశాల నిర్వహణ, సభ్యుల సహకారంపై చర్చించనున్నారు. జూలై 16న సాయంత్రం 4 గంటలకు స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభాపక్ష నేతలతో సమావేశమై.. సభ సజావుగా జరిగేందుకు వారి మద్దతు కోరనున్నారు. కాగా.. ఈ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12తో ముగుస్తాయి.
read also: 2022 లో మోస్ట్ పాపులర్ సినిమాలు ఏంటో తెలుసా..?
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
అయితే.. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుండటంతో ఆయనకు ఇవే చివరి రాజ్యసభ సమావేశాలు కానున్నాయి. కాగా.. ఉపరాష్ట్రపతి ఎన్నిక నిమిత్తం ఈనెల 5న ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ 19వ తేదీతో ముగుస్తుంది. ఇక అధికార, విపక్షాలు మాత్రం ఇంతవరకూ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఈనేపథ్యంలో.. భాజపా పార్లమెంటరీ బోర్డు ఈనెల 16న ఉపరాష్ట్రపతి అభ్యర్థిని వెల్లడిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆ ప్రకారంగా అధికార కూటమి అభ్యర్థి 18-19 తేదీల్లో ఏదో ఒకరోజు నామినేషన్ దాఖలుచేసే అవకాశముంది. ఇక ఆగస్టు 6న ఎన్నిక జరగనుంది. అయితే.. 16న భాజపా ఎంపీలకు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా.. భాజపా పార్లమెంటరీ పార్టీ ఈనెల 16న తమ పార్టీ ఎంపీలకు ప్రత్యేకంగా విందు ఏర్పాటుచేసింది. ఈనేపథ్యంలో.. ఎన్డీయే కూటమి ఎంపీలు, మంత్రుల సమావేశం మాత్రం 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంటరీ గ్రంథాలయ భవనంలో జరగనుంది. ఇక వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈనెల 17న విపక్షాలు భేటీ కానున్నాయి. కావున రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రతిపక్ష నేతలందరికీ ఆహ్వానాలు పంపారు. ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ నేతలంతా విచ్చేసే అవకాశముంది. కాగా.. ఎంపీలంతా ఆరోజు సాయంత్రం 6.30 గంటలకల్లా పార్లమెంటు భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియానికి చేరుకోవాలని పార్లమెంటరీ పార్టీ కార్యాలయం వర్తమానం పంపింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!