ఈ నెల 18వ తేదీ నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి సమావేశం కానున్నారు. ఈనేపథ్యంలో.. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్ఎస్ ఏంపీలకు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దిశా నిర్ధేశం చేయనున్నారు.కాగా.. కేంద్రం నుండి రావాల్సిన నిధుల విషయమై పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిలదీసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. గత సమావేశాల్లో కూడా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో ఇదే రకమైన వ్యూహంతో ముందుకు వెళ్లారు.
అయితే.. వివిధ రాష్ట్రాల సీఎంలు, నేతలతో ఫోన్లో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. మమతా బెనర్జీ, అర్వింద్ కేజ్రీవాల్‌తో చర్చించిన సీఎం.. తేజస్వీయాదవ్ ,అఖిలేశ్ యాదవ్‌తో, శరద్ పవార్‌లతో మాట్లాడారు. కేంద్రంపై పోరాటానికి కలసి రావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మరో వైపు కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 10వ తేదీన సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశం ఏ రకంగా ఇబ్బంది పడుతుందనే విషయాన్ని వివరించారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై కూడా పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ నిలదీసే అవకాశం ఉందని విశ్వనీయ సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా, రైతులను మిల్లర్లను ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ం ఇబ్బంది పెడుతుందని టీఆర్ఎస్ సర్కార్ అభిప్రాయంతో ఉంది. ఈ విషయమైపోరాడాలని పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేయనున్నారు.గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్న తెలంగాణ విషయంలో కేంద్రం పొంతనలేని ద్వంద్వం వైఖరిని దుర్మార్గ విధానాన్ని నిలదీయాలని సిఎం నిర్ణయించారు.
read also: Sai Dharam Tej: తమ్ముడి హీరోయిన్‌తో అన్నయ్య సరసాలు?
రాష్ట్రంలో జరుగుతున్న సోషల్ ఆడిట్ గురించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ప్రశంసించడంతో పాటు అవార్డులు ఇచ్చిన విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. కానీ, నేడు కేంద్ర ప్రభుత్వం మాట మార్చిందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.రోజు రోజుకూ దేశ ఆర్థిక వ్యవస్థ పతనమౌతున్నదని ఆర్థిక వేత్తలు ఆందోళన చెందుతున్నారన్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. క్షీణిస్తున్న రూపాయి విలువే అందుకు నిదర్శనంగా దేశ ప్రజలు భావిస్తున్నారన్నారు. రూపాయి పతనం పై కేంద్రాన్ని ఉభయ సభల సాక్షిగా నిలదీయాలని సిఎం కెసిఆర్ ఎంపీలకు సూచించనున్నారు.
ఇది ఇలా వుండగా.. పార్లమెంట్ సమావేశాల అనంతరం రేపు (శనివారం) బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహించనుంది.పార్లమెంట్ అనెక్స్ భవనంలో జరిగే ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా లోక్‌సభ, రాజ్యసభ సభ్యలకు పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ఒకవైపు పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నందున ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం తరపున ప్రవేశపెట్టనున్న బిల్లులు వాటిపై జరిగే చర్చలో పాల్గొనే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈనేపథ్యంలో మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఎంపిక చేసే విషయాన్ని కూడా చర్చి జరగనుంది. కాగా.. ఈ సమావేశంలో తర్వాత ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును అధికారికంగా ఎన్డీఏ తరుపున ప్రకటింఏ అవకాశం ఉందనే టాక్.. జూలై 18న నిర్వహించే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సమావేశాల్లో ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో రాజకీయంగా తీవ్ర ఆశక్తి కరంగా మారింది.
Sivakarthikeyan :’మహావీరుడు’గా శివకార్తికేయన్