పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 18న ప్రారంభం కానున్నాయి. జులై 18న ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగుతాయని లోక్ సభ, రాజ్యసభ సచివాలయాలు విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. మరో వైపు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజే రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ చివరిసారిగా జనవరి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు సమావేశమైంది.
తొలి రోజు అనగా జులై 18న భారత రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. జులై 21న ఓట్ల లెక్కింపు ఉంటుంది. జులై 25న పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో నూతన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రస్తుత పార్లమెంట్ భవనంలో జరిగే చివరి సమావేశాలు ఇవే కానున్నాయి. నూతన పార్లమెంట్ భవన నిర్మాణం ఈ ఏడాది అక్టోబర్ లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2022 శీతాకాల సమావేశాలు కొత్త భవనంలో జరుగుతాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించారు.
Eknath Shinde: టెంపో డ్రైవర్ నుంచి సీఎంగా ఎదిగాడు.. షిండే ప్రస్థానం..