కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభలో విపక్షాలకు కూడా మాట్లాడటానికి అవకాశం ఉండాలి అని డిమాండ్ చేశారు. సభలో నేను రెండు విషయాలు చెప్పాలనుకున్నాను.. రక్షణ మంత్రి, ఇతరులు మాట్లాడతారు.. కానీ, విపక్ష నేతగా నాకు అవకాశం ఇవ్వలేదు అని మండిపడ్డారు.
Lok Sabha: ఈ రోజు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఈ సందర్భంగా లోక్ సభలో తీవ్ర గందరగోళం కొనసాగింది. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. అలాగే, వాయిదా తీర్మానాలపై చర్చించాలని కోరారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బుధవారం ప్రకటించారు.
Jagdeep Dhankhar: వక్ఫ్ సవరణ చట్టంపై విచారణ, బిల్లుల విషయంలో రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డెడ్‌లైన్ విధించిన నేపథ్యంలో..న్కాయ వ్యవస్థపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా, ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్‌తో పాటు నిషికాంత్ దూబే వంటి పలువురు బీజేపీ నేతలు సుప్రీంకోర్టుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా, మరోసారి జగదీప్ ధంఖర్ న్యాయవ్యవస్థ అతిగా స్పందించడాన్ని విమర్శించారు.
BJP MP: పార్లమెంట్ ఉభయసభల ఆమోదం, రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారిన ‘‘వక్ఫ్ సవరణ బిల్లు’’ని వ్యతిరేకిస్తూ ఇటీవల కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని బుధవారం నుంచి అత్యున్నత న్యాయస్థానం విచారించడం ప్రారంభించింది. ముస్లిమేతరుల్ని వక్ఫ్ బోర్డులో చేర్చడం, వక్ఫ్ బై యూజర్ వంటి ఆస్తుల్ని డీనోటిఫై చేయడం వంటి చట్టంలోని కొన్ని నిబంధనలు రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్లు వాదించారు.
ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం, 2025 అమల్లోకి వచ్చింది. ఈ మేరకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 8 నుంచే ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల నుంచి ఈ బిల్లు పాస్ అవ్వగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో వక్ఫ్ (సవరణ) బిల్లు చట్టంగా మారింది. ఈ నేపథ్యంలో నేటి నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేంద్రం గెజిట్…
వక్ఫ్ బోర్డు బిల్లుపై పార్లమెంటులో రాహుల్ గాంధీ వెన్నుచూపారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడారు. మైనారిటీలపై కాంగ్రెస్ కపట ప్రేమ చూయిస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మైనారిటీల హక్కులను కాలరాసి కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చలో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం దారుణమన్నారు. ప్రియాంక గాంధీ అతి ముఖ్యమైన ఈ బిల్లు సమయంలో పార్లమెంటుకు హాజరు కాకపోవడం అత్యంత దారుణమని…
Waqf Bill: చారిత్రాత్మక వక్ఫ్ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును సభ ముందుంచారు. రిజిజు ప్రసంగం ప్రారంభించిన వెంటనే ప్రతిపక్షాలు అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి నిప్పులు చెరిగారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్, విమానాశ్రయ భూములను వక్ఫ్ ఇచ్చేదని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్‌ని వక్ఫ్ స్వాధీనం చేసుకోవడాన్ని ఆపేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టానికి చేసిన…
Waqf bill: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వక్ఫ్ బిల్లు ఏప్రిల్ 02న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఆగస్టు 2024లో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపబడిన ఈ బిల్లు, లోక్‌సభ ముందుకు రాబోతోంది. ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు బీజేపీ సీనియర్ మంత్రులు ఇండియా కూటమి నేతలతో చర్చలు జరపనున్నట్లు సమాచారం.
పేర్ని నాని మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు మద్దతు ఇస్తున్నాం.. పార్లమెంట్ లో కూడా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని తేల్చి చెప్పారు.