భారతదేశంలో రైళ్ల మీద దాడులు చెయ్యడం సర్వసాధారణం అయ్యింది. ముఖ్యంగా వందేభారత్ రైళ్లు ప్రారంభం అయిన తరువాత రైళ్ల మీద అల్లరిమూకలు రాళ్లు రువ్వడం చాలా ఎక్కువ అయ్యింది. వందేభారత్ రైళ్లను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన తరువాత మామూలు రైళ్ల మీద దాడులు ఎక్కువ అయ్యాయి. రైళ్లపై రాళ్లు రువ్వడం, ట్రాక్లను ధ్వంసం చేయడం వంటి కేసులు పెరుగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి 2023 నుంచి ఫిబ్రవరి 2025 వరకు మొత్తం 7,971 కేసులు నమోదైనట్లు…
మహా కుంభమేళాపై పార్లమెంట్లో మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు కూడా అవకాశమివ్వాలని వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. కుంభమేళాపై విపక్షాలకు కూడా భావాలు ఉన్నాయని.. రెండు నిమిషాలు మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు కూడా ఛాన్స్ ఇవ్వాలని ప్రియాంక కోరారు.
64 ఏళ్ల నాటి ఆదాయపు పన్ను చట్టం మారబోతోంది. ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను బిల్లును తీసుకువస్తోంది. దీనిని రేపు అంటే గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. ఇంతలో దాని ముసాయిదా బయటకు వచ్చింది. ఇది 600 పేజీలకు పైగా ఉంది. ఈ కొత్త చట్టం ఆదాయపు పన్ను చట్టం 2025 అని పిలుస్తారు. దీనిని ఏప్రిల్ 2026 నుంచి అమలు చేయవచ్చు.
New Income Tax Bill: కేంద్ర ఆర్థిక మంత్రి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుని గురువారం పార్లమెంట్లో ప్రవేశపెడతారని తెలుస్తోంది. ఈ బిల్లు ద్వారా పన్ను చట్టాల భాషను సరళీకృతం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఆ తర్వాత దీనిని పార్లమెంట్ ఆర్థిక స్థాయి సంఘానికి పంపుతారు. ఇది ప్రస్తుత పన్ను స్లాబ్లను మార్చడు,
MP Midhun Reddy: పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యలు లేవనేత్తామని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు.. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావడానికి రూ. 60 వేల కోట్లు ఖర్చు అవుతాయని తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా పోలవరం కి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని మారోసారి టార్గెట్ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పినదంతా.. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించేదని అన్నారు.. బీఆర్ అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ దుర్వినియోగం చేసిందని ఆరోపించారు, సామాజిక సంస్కర్త పట్ల ఆ పార్టీ దారుణంగా ప్రవర్తించిందన్నారు.. అంబేద్కర్ను కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవించలేదు.. అంబేద్కర్ను ఓడించేందుకు కుట్రలు చేసిందని విమర్శించారు.
Dinesh Sharma: గృహ హింస, మహిళలపై దోపిడీ చట్టాలను దుర్వినియోగం చేయడంపై గత కొంత కాలంగా దేశంలో చర్చ నడుస్తోంది. బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అతడి భార్య తప్పుడు గృహహింస, వరకట్న వేధింపుల కేసులు పెట్టిన కారణంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందుల్ని పేర్కొంటూ ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. దీంతో ఇలా చట్టాలను దుర్వినియోగం చేసే…
1993లో విడుదలైన జపనీస్-ఇండియన్ యానిమేషన్ చిత్రం ‘రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ ప్రత్యేక ప్రదర్శనను ఫిబ్రవరి 15న పార్లమెంట్లో నిర్వహిస్తున్నట్లు చిత్ర పంపిణీ సంస్థ గీక్ పిక్చర్స్ ఆదివారం తెలియజేసింది. జపాన్-ఇండియన్ యానిమేషన్ చిత్రం ‘రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ ప్రత్యేక ప్రదర్శనకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పార్లమెంటు సభ్యులు, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రత్యేక వ్యక్తులను ఆహ్వానించారు. గీక్ పిక్చర్స్ సహ వ్యవస్థాపకుడు అర్జున్ అగర్వాల్ మాట్లాడుతూ…
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు, ఈకామర్స్ సంస్థల్లో చేరి వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. అన్ని వేళల్లో కస్టమర్లకు సేవలందిస్తున్నారు. జొమాటో, స్విగ్గీ, జెప్టో, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు ఫుడ్, గ్రాసరీ, ఇతర వస్తువులను కస్టమర్లు ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే ఇంటికే డెలివరీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ డెలివరీ వర్కర్స్ కు డిమాండ్ పెరిగింది. అయితే ఆయా సంస్థల్లో వర్క్ చేసే ఆన్ లైన్ డెలివరీ వర్కర్స్…
Sonia Gandhi: పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్తో పాటు ఇతర ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. సోనియా గాంధీ రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ద్రౌపది ముర్ము సుదీర్ఘ ప్రసంగం తర్వాత అలసిపోయినట్లు కనిపించారని కాంగ్రెస్ అధినేత్రి చేసిన వ్యాఖ్యలు ‘‘అవమానకరమైనవి’’ అని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.