PM Modi: పార్లమెంట్‌లో నేడు ‘వందేమాతరం’పై చర్చ ప్రారంభించనున్న మోడీ
- కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
- నేడు ‘వందేమాతరం’పై చర్చ ప్రారంభించనున్న మోడీ
- రాజ్యసభలో చర్చను ప్రారంభించనున్న అమిత్ షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 1 న ప్రారంభమైన సమావేశాలు డిసెంబర్ 19 వరకు కొనసాగనున్నాయి. ఇక సమావేశాల్లో భాగంగా సోమవారం ప్రధాని మోడీ ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవంపై ప్రత్యేక చర్చ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్‌లో చర్చ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ‘వందేమాతరం’లోని అనేక ముఖ్యమైన విషయాలను హైలైట్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రధాని మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. 1937లో వందేమాతం గీతంలోని కీలకమైన చరణాలను తొలగించిందని.. విభజనకు బీజాలు వేసిందని ఆరోపించారు. తాజాగా మరోసారి లోక్‌సభ వేదికగా హస్తం పార్టీని లక్ష్యంగా చేసుకోవచ్చని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Thailand-Cambodia War: మరోసారి కంబోడియా-థాయ్‌లాండ్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. వైమానిక దాడులతో టెన్షన్
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
పార్లమెంట్‌లో ‘వందేమాతరం’పై 10 గంటలు చర్చకు కేటాయించబడింది. ప్రధాని మోడీ తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగించనున్నారు. అనంతరం గౌరవ్ గొగోయ్, ప్రయాంకాగాంధీతో సహా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రసంగించనున్నారు. ఇక రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా చర్చను ప్రారంభించనున్నారు.
ఇది కూడా చదవండి: Trump: ఉక్రెయిన్-రష్యా శాంతి డీల్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వందేమాతం గీతాన్ని బంకిం చంద్ర ఛటర్జీ రాశారు. నవంబర్ 7, 1875లో బంగదర్శన్‌లో మొదటిసారిగా ప్రచురించబడింది. 1905లో బెంగాల్‌లో జరిగిన విభజన వ్యతిరేక ఆందోళన సమయంలో ఈ గీతాన్ని రాజకీయంగా ఉపయోగించారు. అనంతరం ఈ గీతం దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య సమరయోధులను ఏకతాటిపైకి తీసుకొచ్చింది. ఇక ఈ గీతాన్ని జనవరి 24, 1950లో జాతీయ గీతంగా పరిగణించింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం వందేమాతరం 150వ వార్షికోత్సవం నిర్వహించింది. ఏడాది పొడవునా వందేమాతరం వార్షికోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం పార్లమెంట్‌లో ‘SIR’ పై ఆందోళనలు జరుగుతున్నాయి. విపక్ష ఎంపీలంతా నిరసనలు నిర్వహిస్తున్నారు. తక్షణమే ‘సర్’ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్‌లో ‘వందేమాతరం’పై చర్చ ప్రారంభిస్తున్నారు. చర్చ ముందుకు సాగుతుందా? లేదంటే నిరసనలు కొనసాగతాయా? అన్నది చూడాలి.
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..