వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. షుగర్ డౌన్ కావడంతో సొమ్మసిల్లి పడిపోయారు పిల్లి సుభాష్ చంద్రబోస్. హుటాహుటిన డాక్టర్ల పర్యవేక్షణలో రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు..
Panchayat se Parliament 2.0: దేశ వ్యాప్తంగా పంచాయతీరాజ్ వ్యవస్థలోని మహిళా ప్రతినిధులకు పార్లమెంటు సెషన్స్, రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన పంచాయత్ సే పార్లమెంట్ 2.0 కార్యక్రమం ఈరోజు (జనవరి 6) లోక్‌సభలో స్టార్ట్ కానుంది.
క్రిస్మస్ రోజున పార్లమెంట్ భవనం సమీపంలో ఆత్మాహత్యాయత్నం చేసిన 26 ఏళ్ల జితేంద్ర అనే యువకుడు ప్రాణాలు వదిలాడు. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ ఆర్ఎమ్ఎల్ ఆస్పత్రిలో చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు.
ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ కోర్టు సమన్లు జారీ చేసింది. పార్లమెంట్లో జై పాలస్తీనా అనే నినాదానికి చెందిన అంశంపై 2025 జనవరి 7న కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
Rahul Gandhi: రాజ్యసభలో అమిత్ షా ‘అంబేద్కర్’ వ్యాఖ్యలు, ఈ రోజు పార్లమెంట్ వద్ద జరిగిన దాడికి సంబంధించిన ఘటనలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. హోం మంత్రి అందరి ముందే అంబేద్కర్‌ని అవమానించారు. మేము అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశామని రాహుల్ గాంధీ చెప్పారు. అదానీ వ్యవహారాన్ని పక్కన పెట్టాలనేదే బీజేపీ ఉద్దేశ్యమని రాహుల్ ఆరోపించారు.
బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేడ్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల పార్లమెంట్లో తీవ్ర దుమారం రేపాయి. దీంతో పార్లమెంటు లోపలా, వెలుపలా విపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు.
పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ వినూత్న శైలితో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం పాలస్తీనా అనే పేరును ముద్రించిన బ్యాగ్‌ను తగిలించుకుని హల్చల్ చేశారు.
పాలస్తీనాకు కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ పార్లమెంట్ వేదికగా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పాలస్తీనా అని ముద్రించిన బ్యాగ్‌తో పార్లమెంట్ హాల్లో హల్చల్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీపై ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉటంకిస్తూ వక్ఫ్ ఆస్తుల విషయంలో ప్రభుత్వ ఉద్దేశాలను ఆయన ప్రశ్నించారు. “మత సమూహాలకు.. వారి మత, ధార్మిక ప్రయోజనాల కోసం సంస్థలను స్థాపించి.. ఆ సంస్థలను వారే ముందుకు తీసుకెళ్లే హక్కును ఆర్టికల్ 26 ఇస్తుంది." అని చెప్పారు. ప్రధాని మోడీ వక్ఫ్‌కు రాజ్యాంగంతో సంబంధం లేదని చెప్పారు.. ఒక్కసారి ఆర్టికల్ 26ను చదవండి అని…