Mallikarjun Kharge-BJP: వీడ్కోలు లేకుండానే ధన్‌ఖర్‌ను పంపేశారు.. ఖర్గేకు బీజేపీ కౌంటర్
- పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం
- రాజ్యసభ ఛైర్మన్‌గా తొలిసారి అధ్యక్షత వహించిన రాధాకృష్ణన్
- వీడ్కోలు లేకుండానే ధన్‌ఖర్‌ను పంపేశారన్న ఖర్గే
- కాంగ్రెస్ అధ్యక్షుడి భాష గురించి అందరికీ తెలుసని బీజేపీ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇక రాజ్యసభ్య ఛైర్మన్‌గా తొలిసారి సీపీ.రాధాకృష్ణన్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. గత రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌ను ఊహించని రీతిలో ఆకస్మికంగా పంపేశారని గుర్తుచేశారు. కనీసం ఆయనకు వీడ్కోలు పలికే అవకాశం కూడా సభకు లభించలేదని తెలిపారు.
ఇది కూడా చదవండి: Maharashtra: మహిళలకు భర్తలు రూ.100 కూడా ఇవ్వరు.. ఎన్నికల ప్రసంగంలో ఓ మంత్రి కీలక వ్యాఖ్యలు
Also Read
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
ఖర్గే వ్యాఖ్యలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. మాజీ ఛైర్మన్ ధన్‌ఖర్ పట్ల కాంగ్రెస్ ఎలాంటి భాష ఉపయోగించిందో ఎవరూ మరిచిపోరన్నారు. ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు ఉపయోగించారో అందరికీ తెలిసిందేనని ఖర్గేను ఉద్దేశించి అన్నారు. చైర్ గౌరవాన్ని ఎంతగా దెబ్బతీశారో ఒకసారి గుర్తించుకోవాలని హితవు పలికారు. అయినా కొత్త ఛైర్మన్‌ను అభినందించే సమయంలో పాత విషయాలకు పోవడం భావ్యం కాదని ఖర్గేకు సూచించారు.
ఇది కూడా చదవండి: PM Modi: సీపీ.రాధాకృష్ణన్ ప్రజా సేవకే జీవితం అంకితం చేశారు.. చైర్మన్‌ను అభినందించిన మోడీ
అంతకముందు ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘పెద్దల సభా గౌరవాన్ని సభ్యులు గౌరవించాలి. సీపీ.రాధాకృష్ణన్ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారు. రాధాకృష్ణన్ ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. తెలంగాణ, పుదుచ్చేరి, మహారాష్ట్ర, జార్ఖండ్ గవర్నర్‌గా పని చేశారు. అర్థవంతమైన చర్చలు జరిగితే సభకు సార్థకత వస్తుంది.’’ అని మోడీ తెలిపారు. డిసెంబర్ 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!