ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. సాయంత్రం భేటీ అయిన మంత్రివర్గం.. పలు కీలక అంశాలపై దాదాపు 2 గంటల పాటు చర్చించింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు రేపటి(మంగళవారం) నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో కొనసాగనున్నాయి. అయితే రేపటి నుంచి ఎంపీలు కొత్త పార్లమెంట్‌కు మారనున్నారు. అక్కడ ఎంపీలు మాట్లాడే మైక్‌లన్నీ ఆటోమేటెడ్ సిస్టమ్‌తో పని చేస్తాయని సమాచారం.
రేపటి(మంగళవారం) నుంచి పార్లమెంట్ కార్యకలాపాలు కొత్త భవనానికి మారనున్నాయి. పాత పార్లమెంట్ భవనం రాజ్యాంగాన్ని ఆమోదించడంతో సహా కొన్ని చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలిచిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నేడు ప్రారంభం కాగా.. కొత్త పార్లమెంట్ భవనం మంగళవారం నుంచి ఉభయ సభల సమావేశాలకు వేదిక కానుంది.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాలు పాత పార్లమెంట్ భవనంలో జరుగుతుండగా.. మంగళవారం నుంచి నూతన భవనంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు. ప్రత్యేక సమావేశాల్లో ప్రసంగిస్తూ జీ20 సదస్సుపై ప్రధాని మోడీ చర్చించారు.
PM Modi Speech On Parliament Old Building: ‘పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు’ సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ 75 ఏళ్ల ప్రస్థానంపై లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోడీ చర్చను ప్రారంభించారు. మంగళవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు కొత్త భవనంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాత భవనంతో జ్ఞాపకాలను ప్రధాని మోడీ గుర్తుచేసుకున్నారు. భారత్ సువర్ణాధ్యాయానికి ఈ భవనం సాక్షి అని అన్నారు. మనం కొత్త భవనంలోకి వెళ్లినా.. పాత భవనం నిరంతర ప్రేరణగా…
Parliament Session: నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు ఆదివారం నూతన భవనంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ జాతీయ జెండాను ఎగురవేశారు.
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు హాజరు కావాలని బీజేపీ, కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్‌లు జారీ చేశాయి. ఎంపీలు పార్లమెంట్‌కు హాజరు కావాలని, పార్టీ వైఖరికి మద్దతు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ విప్ జారీ చేసింది.
సోమవారం ఆల్ పార్టీ మీటింగ్ లో సమావేశాల ఎజెండా తెలిసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 19న వినాయక చతుర్థి రోజున కొత్త పార్లమెంట్ లోకి సభ మారబోతోంది. మరోవైపు శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలు వినాయక చవితి రోజున పార్లమెంట్ సమావేశాలు ఏంటని ప్రశ్నిస్తున్నాయి.
New Parliament: కేంద్రం ఈ నెల 18-22 వరకు 5 రోజలు పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చింది. ఇదిలా ఉంటే ఈ నెల 19న కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది.