రాహుల్ గాంధీ అధ్యక్షతన ఈరోజు కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 14 రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు, ఎంపీలు హాజరయ్యారు. కేంద్రంపై ఉమ్మడిపోరును సాగించేందుకు అనుసరించాల్సిన వ్యూహం గురించి ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా పెగాసస్ స్పైవేర్ అంశంపై విపక్షాలు పట్టుబడుతున్నారు. దీంతో పాటుగా ప్రజాసమస్యలపై ఉమ్మడిగా పార్లమెంట్‌లో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాయి. బిల్లులపై సమగ్రంగా చర్చించకుండానే ఆమోదించుకోవడంపై కూడా విపక్షాలు మండిపడుతున్నాయి.