ఏపీలో గత మూడేళ్లుగా నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నట్లు సోమవారం నాడు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీలో గత ఐదేళ్లలో 294 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఆయన వివరించారు. 2017లో 55 మంది, 2016లో 36 మంది, 2017లో 55 మంది, 2018లో 44 మంది, 2019లో 71 మంది, 2020లో 88 మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మరోవైపు తెలంగాణలో మాత్రం…
విభజన అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. అనంతర రంజిత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 23 అంశాలపై పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో చర్చించామని తెలిపారు. 23 అంశాలను పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామన్నారు. ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ తమకు ఒక బుక్‌లెట్ అందించారని పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై ఇప్పటికే కేసీఆర్ కేంద్రానికి లేఖలు రాశారని గుర్తుచేశారు. బడ్జెట్ కూర్పు చూశాక రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం…
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సమయం ఆసన్నమైంది.. కేంద్ర బడ్జెట్ 2022-23 ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధమైంది.. ఈ సారి కూడా రెండు విడతలుగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు.. జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు మొదటి విడత బడ్జెట్ సమావేశాలు జరగనుండగా.. మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు రెండో విడత బడ్జెట్ సెషన్ నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.. ఇక, కేంద్ర బడ్జెట్ 2022-23ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో…
ప్రజా సమస్యలపై చర్చించడం.. ప్రజల అవసరాలను గుర్తించడం.. వాటికి అనుగుణంగా కొత్త చట్టాలను తీసుకురావడం.. పాత చట్టాలను సవరించండం.. ఇలా పార్లమెంట్‌కు ఎంతో అత్యున్నత స్థానం ఉంది.. అయితే, క్రమంగా అదో రాజకీయ వేదికగా మారిపోతోంది.. గతంలో ఎన్నో అర్థవంతమైన చర్చలు జరిగిన చట్టసభల్లో ఇప్పుడు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు ఇలా.. అసలు చర్చ మొత్తం పక్కదారి పట్టేలా చేస్తున్నాయి.. ఇక, తాజాగా, జోర్డాన్ పార్లమెంట్‌లో సభ్యులు మరో ముందు…
పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు టీఆర్ఎస్ ఎంపీలు.. పార్లమెంట్ సమావేశాలు బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చారు.. ఈ రోజు కూడా దాన్యం సేకరణ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉభయ సభల్లో ఆందోళన చేపట్టనున్నారు టీఆర్ఎస్ ఎంపీలు.. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా లోక్‌సభ, రాజ్యసభలో రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన చేస్తున్న ఎంపీలు.. ఇవాళ సమావేశాలను బహిష్కరించనున్నారు.. Read Also: ఇక అలా కుదరదు..! వర్క్ ఫ్రమ్ హోంపై…
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలిరోజే రచ్చతో మొదలయ్యాయి… ప్రతిపక్షాల ఆందోళనలతో సభ ప్రారంభమైన వెంటనే గంట పాటు వాయిదా వేశారు లోక్‌సభ స్పీకర్.. మరోవైపు రాజ్యసభలోనూ ఇలాంటి పరిస్థితే రిపీట్ అయ్యింది.. అయితే, దేశ ప్రగతి కోసం పార్లమెంటులో చర్చలు జరగాలని ఆకాక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ.. రాజ్యాంగ దినోత్సవం స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని సూచించిన ఆయన.. ప్రతీ ప్రశ్నకు జవాబిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముందు మీడియాతో మాట్లాడిన…
ఏపీలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని పార్లమెంట్ లో డిమాండ్ చేయాలని నిర్ణయించింది టీడీపీపీ… పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశం ద్వారా పార్టీ ఎంపీలకు పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు చంద్రబాబు… Read Also: ఏపీ మూడు రాజధానుల కేసు.. హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ వరద సాయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, జ్యుడీషియల్ విచారణకి డిమాండ్ చేయాలని టీడీపీ భావిస్తోంది..…
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతోన్న తరుణంలో లోక్‌సభ, రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్.. సచివాలయంలో పార్టీ ఎంపీలతో సమావేశమైన ఆయన.. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు మార్గ నిర్దేశం చేశారు.. ఎంపీలకు సీఎం వైఎస్ జగన్ సూచనలు: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల రూ. 55,657 కోట్ల ఆమోదానికి కృషి చేయాలి. జాతీయ హోదా ప్రాజెక్టు అంటే విద్యుత్తు,…
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది.. ఈనెల 29 నుంచి డిసెంబర్ 23 వరకు శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో ఇవాళ భేటీ అయిన కమిటీ… కోవిడ్ నిబంధనలతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈసమావేశాల్లో నిత్యవసర ధరలతో పాటు సాగు చట్టాలు, పెగాసెస్ వ్యవహారంపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీసే అవకాశముంది… ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధం అవుతుండగా.. విపక్షాలను ఎలా తిప్పికొట్టాలన్న వ్యూహాలపై…