పార్లమెంట్‌లో ఇవాళ జరిగిన పరిణామాలపై కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. కాంగ్రెస్ అధినేత్ర సోనియా గాంధీ పట్ల బీజేపీ ఎంపీల అనుచిత ప్రవర్తనను ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లేందుకు చొరవ తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు.
కేంద్రం 2017 నుంచి ప్రకటనల కోసం రూ. 3,339 కోట్లు ఖర్చు చేసిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇవాళ రాజ్యసభలో వెల్లడించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆయన తెలిపారు.
రాజ్యసభలో జరిగిన గందరగోళ పరిస్థితుల మధ్య డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో మరో ముగ్గురు విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటుపడింది. సభను, సభాపతి అధికారాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా సభా వెల్‌లోకి ప్రవేశించి, నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించి సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారని డిప్యూటీ చైర్మన్ వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
భారతదేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై కేంద్రం స్పందించింది. ప్రస్తుతానికి దేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే విషయంపై ఎలాంటి ప్రతిపాదన లేదని కాంగ్రెస్ ఎంపీ అదూర్ ప్రకాశ్ అడిగిన ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వెల్లడించారు.
రాజ్యసభలో జరిగిన గందరగోళ పరిస్థితుల మధ్య డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిక ధరలపై సభలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. డిప్యూటీ ఛైర్మన్ సభను సజావుగా సాగేలా సహకరించాలంటూ కోరారు. కానీ ఆందోళనను విరమించకపోవడంతో... నిరసనలతో గందరగోళం సృష్టిస్తూ, సభా కార్యకలాపాలరు అంతరాయం కలిగిస్తున్నారంటూ విపక్షాలకు చెందిన 18 మంది ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు.
లోక్‌సభలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. అనుచిత ప్రవర్తనతో సభకు ఆటంకం కలిగిస్తున్నారని లోక్‌సభ స్పీకర్ నలుగురు కాంగ్రెస్ ఎంపీలను మొత్తం వర్షాకాల సమావేశాల నుండి సస్పెండ్ చేశారు.
రాజ్యసభ ఎంపీగా ప్రముఖ మాజీ క్రీడాకారిణి పీటీ ఉష ప్రమాణస్వీకారం చేశారు. ఆమె హిందీలో భాషలో ప్రమాణం చేసింది. ఇటీవల ప్రఖ్యాత స్వరకర్త ఇళయరాజా, ఫిల్మ్ రైటర్ విజయేంద్ర ప్రసాద్, ఆధ్యాత్మిక నాయకుడు వీరేంద్ర హెగ్గడేతో పాటు ఉష పార్లమెంటు ఎగువ సభకు నామినేట్ చేయబడింది. ఉషను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యసభకు నామినేట్ చేసింది.
పార్లమెంట్ ఉభయ సభల్లో అంతరాయాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఆయనెప్పుడూ పార్లమెంట్‌లో గళం వినిపించింది లేదని... ప్రభుత్వాన్ని ప్రశ్నించింది లేదని ఆమె మండిపడ్డారు.
పార్లమెంట్ సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. అలాగే రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అర్థవంతంగా జరుగుతాయని భావిస్తున్నట్లు ప్రధాని వ్యాఖ్యానించారు.
Digital media in India will be regulated and can face action for "violations" under an amended law that the government plans to bring in the parliament session starting next week.