ప్రస్తుతం దేశంలో డిజిటల్ మీడియాకు పరిమితులు అన్న మాటే లేదు. డిజిటల్ మీడియాను నియంత్రించేందుకు కేంద్రం ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించిన చట్ట సవరణ బిల్లును వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని సర్కారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లును ప్రభుత్వం ఆమోదిస్తే డిజిటల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. తప్పుడు సమాచారం ఇచ్చినట్టు రుజువైతే వెబ్‌సైట్ రిజిస్ట్రేషన్ రద్దు చేయడం, జరిమానా విధించేందుకు అవకాశం కలుగుతుంది.
ఈ కొత్త బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే ఆ వెంటనే చట్టంగా మారనుంది. ఫలితంగా డిజిటల్ మీడియా కూడా చట్టం పరిధిలోకి రానుంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ బిల్లుకు కేంద్రం తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం. ఈ బిల్లు చట్టంగా మారితే.. ఇప్పటిదాకా ప్రభుత్వ రెగ్యులేషన్ పరిధిలో లేని డిజిటల్ న్యూస్ ఇకపై మీడియా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోకి రానుంది.
PM Modi: రేపు బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ఇక ఈ నిబంధలను అమల్లోకి వచ్చిన 90 రోజుల్లోగా డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. వారు ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ బిల్లుకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి అనుమతి రావాల్సి ఉంది. 2019లో కొత్త ఐటీ చట్టం కింద డిజిటల్ మీడియాను నియంత్రించేందుకు కేంద్రం ప్రయత్నించగా తీవ్ర వివాదాస్పదమైంది. డిజిటల్ మీడియా స్వేచ్ఛకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో అప్పట్లో ప్రభుత్వం వెనకడుగు వేసింది. బ్రిటిష్ హయాంలో ఉన్న ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ స్థానంలో రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ బిల్లును భారత ప్రభుత్వం తీసుకుచ్చింది. ఇది వార్తా పత్రికలు, ప్రింటింగ్ ప్రెస్‌లను నియంత్రిస్తుంది.