పార్లమెంట్‌లో ఎంపీల రచ్చ.. చొక్కాలు పట్టుకుని కొట్టుకొని..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజా సమస్యలపై చర్చించడం.. ప్రజల అవసరాలను గుర్తించడం.. వాటికి అనుగుణంగా కొత్త చట్టాలను తీసుకురావడం.. పాత చట్టాలను సవరించండం.. ఇలా పార్లమెంట్‌కు ఎంతో అత్యున్నత స్థానం ఉంది.. అయితే, క్రమంగా అదో రాజకీయ వేదికగా మారిపోతోంది.. గతంలో ఎన్నో అర్థవంతమైన చర్చలు జరిగిన చట్టసభల్లో ఇప్పుడు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు ఇలా.. అసలు చర్చ మొత్తం పక్కదారి పట్టేలా చేస్తున్నాయి.. ఇక, తాజాగా, జోర్డాన్ పార్లమెంట్‌లో సభ్యులు మరో ముందు అడుగు వేశారు.. పార్లమెంట్ వేదికగానే రచ్చ చేశారు.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు.. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జోర్డాన్ పార్లమెంట్‌లో సమానహక్కులపై తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ సాగుతుండగా.. ఆ వ్యవహారంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది.. అదికాస్తా శృతిమించి వాగ్వాదం జరిగింది.. ఆ తర్వాత పరస్పర దాడికి దిగారు పార్లమెంట్ సభ్యులు.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా.. ఈ బిల్లు పనికిరానిదంటూ ప్రతిపక్ష సభ్యుడు అనుచిత వ్యాఖ్యలు చేయగా.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికార పార్టీ ఎంపీలు.. సదరు ఎంపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందుకు సదరు సభ్యుడు నిరాకరించడంతో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం, దాడికి దారితీసింది.. ఇది కాస్తా చినికి చినికి తీవ్ర ఘర్షణగా మారిపోయింది.. అయితే, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. ప్రజా సమస్యలపై చర్చించడానికి ప్రజలు మిమ్మల్ని పార్లమెంట్‌కు పంపితే.. మీరు చేసే పని ఇదేనా అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు.
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
తాజావార్తలు
-
Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
ట్రెండింగ్
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!