PM Modi: సోనియా జీ మీ ఆరోగ్యం ఎలా ఉంది?.. అడిగి తెలుసుకున్న ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ఉభయసభలు మణిపూర్ అంశంపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో రెండు సభలు ఆందోళనలతో అట్టుడికిపోయాయి. ఈ నేపథ్యంలో రెండు సభలు రేపటికి వాయిదా పడ్డాయి. సభ ప్రారంభమయ్యే ముందు కాంగ్రెస్ నేత సోనియా గాంధీని ప్రధాని మోదీ పలుకరించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మణిపుర్ అంశంపై చర్చించాలని మోదీకి సోనియా విజ్ఞప్తి చేసినట్లు లోక్‌సభలో ఆ పార్టీ నేత అధిర్ రంజన్ చౌధురి వెల్లడించారు. సమావేశాల తొలిరోజు లోక్‌సభ సభ్యులను ప్రధాని మోదీ కలిసిన సందర్భంగా ఈ సంభాషణ జరిగినట్లు ఆయన చెప్పారు. లోక్‌సభ సమావేశాల మొదటి రోజు వివిధ పార్టీల సభ్యులు పలకరించుకోవడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో సోనియా గాంధీని ప్రధాని మోడీ పలకరించారు. ఆమె ఆరోగ్యం గురించి మోడీ వాకబు చేశారు.
Also Read: Russia President Putin: పుతిన్ దక్షిణాఫ్రికా పర్యటన రద్దు.. ఎందుకంటే..?
Also Read
- Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- 11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
సాంకేతిక లోపం కారణంగా భోపాల్‌లో ఆమె చార్టర్డ్ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయిన కొద్ది రోజుల తరువాత, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్యం గురించి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పార్లమెంటులో ఆరా తీశారు. తాను బాగానే ఉన్నానని సోనియా గాంధీ ప్రధాని మోదీకి హామీ ఇచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల సోనియా, రాహుల్ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడాన్ని ప్రస్తావించిన మోడీ.. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం తన తల్లి సోనియా గాంధీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలో, 76 ఏళ్ల సోనియా గాంధీ కూర్చొని ఆక్సిజన్ మాస్క్ ధరించి కనిపించారు. సాంకేతిక లోపం కారణంగా వారి చార్టర్డ్ విమానం భోపాల్‌లో అత్యవసర ల్యాండింగ్ చేయబడింది. జులై 17, 18 తేదీల్లో రెండు రోజులపాటు జరిగిన ప్రతిపక్షాల మెగా సమావేశానికి హాజరైన తర్వాత సోనియా గాంధీ బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్తున్నారు. సాంకేతిక సమస్య పరిష్కరించబడిన తరువాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు బుధవారం రాత్రి 9:30 గంటలకు ఇండిగో విమానంలో ఢిల్లీకి తమ ప్రయాణాన్ని కొనసాగించారు.
తాజావార్తలు
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!