AAP MP Suspend: ఆప్ ఎంపీపై రాజ్యసభ ఛైర్మన్ ఆగ్రహం.. సభ నుంచి సస్పెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP MP Suspend: మణిపూర్‌లో జరిగిన హింసాకాండపై పార్లమెంట్‌లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగిన నేపథ్యంలో ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌ను వర్షాకాల సమావేశాల మిగిలిన కాలానికి రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. హౌస్‌లోని వెల్‌లోకి దూకి నినాదాలు చేశారనే ఆరోపణతో రాజ్యసభ ఛైర్మన్ హెచ్చరించినప్పటికీ వెనక్కి వెళ్లేందుకు నిరాకరించినందుకు సంజయ్ సింగ్‌ను సస్పెండ్ చేశారు. సభలో అనుచిత ప్రవర్తన కారణంగా ఆప్ ఎంపీని వర్షాకాల సమావేశాల మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్లు ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ ప్రకటించారు.
Also Read: Tamilnadu: మహిళలకు తమిళనాడు సర్కారు గుడ్ న్యూస్
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
ఈ ఉదయం 11 గంటలకు రాజ్యసభ సమావేశం కాగానే ప్రతిపక్ష సభ్యులు మణిపుర్ అంశాన్ని లేవనెత్తారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే సభ వాయిదా పడింది. అనంతరం 12 గంటలకు రాజ్యసభ తిరిగి ప్రారంభమవ్వగా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. మణిపుర్ అంశంపై ప్రధాని మోడీ సభకు వచ్చి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు నినాదాలు చేశాయి. ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించేందుకు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ అనుమతించారు. జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిస్తున్నప్పుడు, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సభ వెల్‌లోకి దూకి నినాదాలు చేయడం ప్రారంభించారని ఆరోపించారు.
Also Read: Parliament: పార్లమెంట్‌లో గందరగోళం.. ఉభయసభలను కుదిపేస్తున్న మణిపూర్ అంశం
విపక్ష ఎంపీలు రూల్ 267 కింద చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నప్పుడు ప్రశ్నోత్తరాల సమయం కొనసాగడానికి అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సంజయ్ సింగ్ నిరసన వ్యక్తం చేశారు. వెనక్కి వెళ్లాల్సిందిగా ఛైర్మన్ ఆయనను హెచ్చరించారు. కానీ ఆయన నినాదాలు చేస్తూనే ఉన్నారు. రాజ్యసభలో సభా నాయకుడు పీయూష్ గోయల్ లేచి, ఇది రాజ్యసభ క్రమశిక్షణస ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని చైర్మన్‌ను కోరారు. దీంతో ఛైర్మన్ ఎంపీ సంజయ్ సింగ్ సస్పెన్షన్‌ను ప్రకటించారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!