ఆర్థిక మాంద్యం, ఎన్నికలు, ఆర్థిక క్రమశిక్షణ, జనాకర్షణ అనేక సవాళ్ల మధ్య కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిద్ధమయ్యారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్న 2024 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనా రేటును 6.8 శాతానికి తీసుకెళ్లడానికి పునాది వేయనుంది. 2019 తర్వాత ఐదో సారి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.
Parliament Budget Session : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అదే రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం కానున్నాయి. ఈ ఆర్థిక ఏడాది బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభోపన్యాసం చేయనున్నారు.