Union Budget 2023: గత ఏడాది మాదిరిగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు కేంద్ర బడ్జెట్ 2023-2024ను పేపర్‌లెస్ ఫార్మాట్‌లో సమర్పించనున్నారు. కేంద్ర బడ్జెట్‌ను సమర్పించేందుకు పార్లమెంటుకు వెళుతున్నప్పుడు నిర్మలా సీతారామన్ సంప్రదాయ బహి-ఖాతా స్టైల్ పర్సులో జాతీయ చిహ్నంతో చుట్టబడిన డిజిటల్ టాబ్లెట్‌ను తీసుకువెళ్లారు. ఆమె తన అధికారుల బృందంతో కలిసి తన కార్యాలయం వెలుపల ఒక ఫోటోకు కూడా పోజులిచ్చింది. 2019లో ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత సీతారామన్‌కి ఇది ఐదో బడ్జెట్. నిర్మలా సీతారామన్ జూలై 2019లో యూనియన్ బడ్జెట్ పత్రాలను తీసుకువెళ్లడానికి సాంప్రదాయ ‘బడ్జెట్ బ్రీఫ్‌కేస్’ వలస వారసత్వాన్ని వదులుకున్నారు. ఆమె 2020లో బ్రీఫ్‌కేస్ ద్వారానే బడ్జెట్ పత్రాలను తీసుకెళ్లారు. 2021లో కరోనా మహమ్మారి నేపథ్యంలో డిజిటల్ టాబ్లెట్‌ను వినియోగించారు .అదే సంవత్సరం, పార్లమెంటు సభ్యులు, ప్రజలకు బడ్జెట్ పత్రాలను అవాంతరాలు లేకుండా యాక్సెస్ చేయడానికి ఆర్థిక మంత్రి ‘యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్’ని కూడా ప్రారంభించారు.
Stock Markets Today: బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో జోష్.. భారీ లాభాల్లో సెన్సెక్స్
బడ్జెట్‌ను సమర్పించే ముందు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రపతికి వివరాలు అందించారు. రాష్ట్ర పతితో భేటీ అనంతరం కేంద్ర మంత్రి వర్గంతో సమావేశమయ్యారు. బడ్జెట్‌ను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. మంగళవారం నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను సమర్పించారు, కొవిడ్-19 నుంచి భారతదేశం ఆర్థిక పునరుద్ధరణ పూర్తయిందని, ఆర్థిక వ్యవస్థ ఈ పరిధిలో వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6 నుంచి 6.8 శాతం.
#WATCH | Finance Minister Nirmala Sitharaman with her team at Parliament, to deliver her fifth #Budget today pic.twitter.com/kauGclIcgb
— ANI (@ANI) February 1, 2023