ఛత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది. ఆస్తి వివాదంలో జర్నలిస్టు కుటుంబం దారుణ హత్యకు గురైంది. ఆజ్‌తక్ జిల్లా రిపోర్టర్ సంతోష్ కుమార్ టోప్పో తల్లిదండ్రులు, సోదరుడు ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మానవ సంబంధాలు తలదించుకునే ఉదంతం వెలుగు చూసింది. ఇక్కడ బస్తా ప్రాంతానికి చెందిన దంపతులు బైక్ కొనుక్కోవాలనే కారణంతో తమ తొమ్మిది రోజుల నవజాత శిశువును విక్రయించారు. ఆ దంపతులు తమ అమాయకపు బిడ్డను కేవలం రూ.60 వేలకే వేరొకరికి విక్రయించినట్లు సమాచారం. ఈ అక్రమ చర్యపై సమాచారం అందుకున్న పోలీసులు నవ దంపతుల నుంచి చిన్నారికి విముక్తి కల్పించారు. నిందితులైన దంపతులు, తమ బిడ్డను పెంచలేకపోవడం వల్లే తమ బిడ్డను దానం…
జార్ఖండ్‌లోని రాంచీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇక్కడ డబ్బు కోసం తల్లిదండ్రులు తమ కుమారుడిని హత్య చేశారు. విషయం ఠాకూర్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్రాటు గ్రామంలో చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి ఇక్కడ ఓ యువకుడిని అతని తండ్రి, సవతి తల్లి కలిసి చంపేశారు.
ఈ కాలంలో పిల్లలను పెంచి పెద్ద చేయడం పెద్ద సవాలుగా మారింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం ఒక కారణమైతే.. రోజురోజుకూ పిల్లల మారాం పెరిగిపోతుండటం మరో కారణం. అయితే.. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని కొడుతుంటారు. విదేశాల్లో పిల్లల్ని కొట్టడం నేరం. కానీ, మన దేశంలో పిల్లల్ని సరిదిద్దేందుకు పేరెంట్స్ కొడతారు. భరించలేని కోపమొచ్చినప్పుడు ఓ చెంపదెబ్బ చాలు. అంతేకానీ, పదే పదే అదే పనిగా కొడుతుంటే అది వారి స్టడీస్, మెంటల్ కండీషన్, లైఫ్‌పై…
"ఉదయం ఆరింటికి లేచి చకచకా రెడీ అయ్యి.. స్కూల్ కి పరిగెత్తి.. సాయంత్రం స్కూల్ నుంచి తిరిగి రాగానే.. స్నాక్స్ తిని ట్యూషన్ కి వెళ్లి అక్కడి నుంచి రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల మధ్య ఇంటికి తిరిగి వచ్చి.. డిన్నర్ చేసి స్కూల్, ట్యూషన్ హోంవర్క్ పూర్తి చేసి.. రాత్రి 10 నుంచి 11 గంటలకు పడుకుని మళ్లీ ఉదయం లేచి.. పరిగెత్తడం." రోజూ మీ పిల్లలు ఇంట్లో ఇదే చేస్తున్నారా?
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ దుర్మార్గుడైన కొడుకు తన వృద్ధ తల్లిదండ్రుల గొంతు కోసి హత్య చేశాడు. ఈ క్రమంలో.. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను చూసి ఓ పాట పాడాడు. హంతకుడి చర్యలను చూసి పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. కాగా.. నిందితుడు తప్పించుకునే క్రమంలో అతన్ని పోలీసులు షూట్ చేశారు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
తమిళనాడులో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ధర్మపురి, మొరప్పూర్ సమీపంలోని ఒక గ్రామంలో మంగళవారం రాత్రి ఓ ప్రేమజంట పారిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా కలకలం రేగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన యువతి కుటుంబ సభ్యులు యువకుడి తల్లిని తీసుకొచ్చారు. పారిపోయిన అమ్మాయి అగ్రవర్ణానికి చెందినది కాగా.. అబ్బాయి దళితుడని (ఎస్సీ) చెప్పారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీని ఒలింపిక్ విజేత మను భాకర్ కలిశారు. పారిస్ 2024 ఒలింపిక్స్‌లో మను భాకర్ రెండు పతకాలు సాధించింది. పారిస్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమెకు ఘనస్వాగతం లభించింది.
కన్న కొడుకు నుండి రక్షణ కల్పించండంటూ, రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు ఓ సీఐ తల్లిదండ్రులు. నలుగురికి రక్షణ కల్పించాల్సిన స్థాయిలో ఉండి కూడా ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను ఓ సీఐ వేధిస్తున్నాడు. కొడుకు నుండి రక్షణ కల్పించాలంటూ బాధిత తల్లిదండ్రులు రాష్ట్ర డీజీపీని కలిసి కొడుకు పై ఫిర్యాదు చేశారు.
జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లా ప్రధాన కార్యాలయానికి 30 కిలోమీటర్ల దూరంలోని అడవులు, ఎత్తైన పర్వతాలతో చుట్టుముట్టబడిన దేసాలో సోమవారం సాయంత్రం 7.30 గంటలకు భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల తూటాలకు వీర జవాన్లు ధీటుగా సమాధానం చెప్పారు. కాగా.. ఆర్మీ కెప్టెన్ బ్రిజేష్ థాపా, సైనికుడు నాయక్ డి రాజేష్, కానిస్టేబుల్ బిజేంద్ర, అజయ్ సింగ్ గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు.