కొన్ని సందర్భాల్లో రీల్ సీన్స్ రియల్ సీన్స్ గా మారినప్పుడు ఆశ్చర్యపోవడం తప్పనిసరి అవుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. 2014లో 19 ఏళ్ళ వయసులో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ యువకుడు 11 ఏళ్ల తర్వాత తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరాడు. కనిపోయించకుండా పోయిన కుమారుడు తమ చెంతకు చేరడంతో తల్లిదండ్రుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది. 11 ఏళ్ల క్రితం కనిపోయించకుండా పోయిన కుమారుడిని మెదక్ జిల్లా పోలీసులు తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.
Also Read:Tollywood : అలనాటి క్లాసిక్ టైటిల్స్ తో వచ్చిన ఇప్పటి తెలుగు సినిమాలు..
2014లో 19 ఏళ్ళు ఉన్నప్పుడు ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు తేజసాయి(ప్రస్తుత వయసు 30). 11 ఏళ్లుగా కుమారుడి కోసం తల్లిదండ్రులు శ్రీనివాసరావు, శారద వెతుకుతున్నారు. ఈ నెల ఏప్రిల్ 3న మెదక్ ఎస్పీని కలిసి విషయం తెలియజేశారు తేజసాయి తల్లిదండ్రులు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో సాయితేజ బెంగళూరులో ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు బెంగళూరు వెళ్లి సాయితేజని తీసుకువచ్చి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పజెప్పారు.
Also Read:Tamil Nadu: తొలిసారి గవర్నర్, రాష్ట్రపతి అనుమతి లేకుండానే 10 బిల్లులు ఆమోదం
బెంగళూరులో పెళ్లి చేసుకుని అక్కడే హోటల్ నడుపుకుంటూ స్థిరపడ్డాడు తేజసాయి. సొంతంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో తల్లితండ్రులను వీడి బెంగళూరు వెళ్లినట్టు తేజసాయి తెలిపాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోయి చెడు వ్యసనాలకు, చెడు మార్గాల్లో పయనించకుండా సొంతంగా వ్యాపారం ప్రారంభించి స్థిరపడ్డ తేజసాయిని పోలీసులు అభినందించారు. మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డికి తేజసాయి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.