అమెరికాలో చావుబతుకల మధ్య కొట్టిమిట్టాడుతున్న భారతీయ విద్యార్థిని నీలం షిండేను కలిసేందుకు తల్లిదండ్రులకు అత్యవసరంగా అమెరికా రాయబార కార్యాలయం వీసా మంజూరు చేసింది. దీంతో నీలం షిండే పేరెంట్స్.. అమెరికా వెళ్లనున్నారు.
నీలం షిండే (35) గత నాలుగేళ్ల నుంచి అమెరికాలో చదువుకుంటోంది. అయితే ఈనెల 14న ఆమె ప్రయాణించిన కారు ప్రమాదానికి గురైంది. అప్పటి నుంచి ఆమె ఐసీయూలో ఉంది. ప్రస్తుతం కోమాలోకి వెళ్లింది. నీలం షిండేది మహారాష్ట్రలోని సతారా జిల్లా. అయితే కుమార్తెను చూసేందుకు వీసా కోసం తల్లిదండ్రులు ప్రయత్నించారు. కానీ మంజూరు కాలేదు. దీంతో లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలే జోక్యం పుచ్చుకున్నారు. కుమార్తెను చూసేందుకు తల్లిదండ్రులకు అత్యవసర వీసా మంజూరు అయ్యేలా చూడాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Samsung Galaxy M06: అదిరిపోయే ఫీచర్లున్న మొబైల్‌ను రూ.9499కే తీసుకొచ్చిన శాంసంగ్
ఇదిలా ఉంటే ప్రమాదం చేసిన కారు డ్రైవర్ వెంటనే అక్కడ నుంచి పారిపోయాడు. ఎట్టకేలకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 16న ప్రమాదం జరిగినట్లుగా తమకు తెలిసిందని తండ్రి తనాజీ షిండే తెలిపారు. అప్పటి నుంచి వీసా కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కానీ ఇప్పటి వరకు తమకు వీసా రాలేదని వాపోయాడు.
దీంతో ఎన్‌సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సులే స్పందించి.. వీసా ఇప్పించడానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సహాయం కోరినట్లు తెలిపారు. ఈ సమస్యను త్వరగా కేంద్రం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని ఎంపీ హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే కారు ప్రమాదంలో బాధితురాలి కాళ్లు, చేతులు విరిగిపోయినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా తలకు గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. నీలం షిండే గత నాలుగేళ్లుగా అమెరికాలో ఉంటుంది. ఈ ఏడాదితో చదువు పూర్తవుతుంది. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది.
ఇది కూడా చదవండి: Cryptocurrency Scam : క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో హీరోయిన్స్ తమన్నా, కాజల్ అగర్వాల్..?