ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలంలో ఐలాపూర్ షడ్యూల్డ్ తెగ గ్రామ పంచాయితీకి చెందిన పలువురు ప్రజలు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ, కుల సర్వేను బహిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మల్లెల లక్ష్మయ్య మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా.. తమ గ్రామానికి ఇంత వరకు తారు రోడ్డు నిర్మించక పోవడం దారుణమన్నారు.
ఆగస్టు 15న జరిగిన ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ముంగేలిలో జరిగిన వేడుకల్లో జిల్లా ఎస్పీ గిరిజా శంకర్ జైస్వాల్ పావురాన్ని పైకి విసిరారు. కానీ అది పైకి వెళ్లకుండా కిందపడిపోయింది.