Mulugu: ములుగు జిల్లాలోని ఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణ.. కారణం ఇదే..
- సమగ్ర కుటుంబ.. కుల సర్వేను బహిష్కరించిన గ్రామస్థులు
- తమ గ్రామంలో తారు రోడ్డు నిర్మించాలని డిమాండ్
- గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాలన్న మాజీ సర్పంచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలంలో ఐలాపూర్ షడ్యూల్డ్ తెగ గ్రామ పంచాయితీకి చెందిన పలువురు ప్రజలు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ, కుల సర్వేను బహిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మల్లెల లక్ష్మయ్య మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా.. తమ గ్రామానికి ఇంత వరకు తారు రోడ్డు నిర్మించక పోవడం దారుణమన్నారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు తమ గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడం లేదని ఆరోపించారు. గిరివికాస పథకం ద్వారా బోర్లు దింపి 7 సంవత్సరాలు గడుస్తున్నా.. ఆ బోర్లాకు మూడు తీగల కరెంట్ కరవైందని వాపోయారు. తమ గ్రామానికి సరైన మౌలిక సౌకర్యాలు కల్పించే వరకు ఈ కుల గణన సర్వేని జరగనివ్వమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
READ MORE: Sajjanar: ఒక అవకాశం ఇచ్చి చూడండి సార్.. కీరవాణికి సజ్జనార్ రిక్వెస్ట్!
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
కాగా.. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్, గుండంపెల్లి గ్రామాల్లోని ప్రజలు కూడా ఈ సర్వేను ఇటీవల బహిష్కరించారు. తమ గ్రామాలైన దిలావర్పూర్-గుండంపెల్లి మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా వారు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కుల గణన సర్వే ప్రారంభమవ్వడంతో దానిని నిర్వహించేందుకు గ్రామాల్లోని ప్రజల వద్దకు ఎన్యుమరేటర్లు వెళ్లగా, ప్రజలు తిరస్కరించడం తీవ్రమైన అంశంగా మారింది. ప్రభుత్వం తమ గ్రామాలకు హాని కలిగించే ఇథనాల్ ఫ్యాక్టరీని ఎత్తి వేసేందుకు సహకరించడం లేదని గ్రామస్థులు వాపోయారు. అధికారులకు తాము వివరాలు చెప్పమని, తమ ఊరి నుంచి వెళ్లిపోవాలని పేర్కొంటున్నారు. ఫ్యాక్టరీని తరలించే వరకు సమగ్ర కుల సర్వేకు సహకరించేది లేదని గ్రామస్థులు తీర్మానం చేసి అక్కడి అధికారులకు అందజేశారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక వెనుదిరిగి వెళ్లిపోయారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!